ఎలాంటి డ్రస్ వేసుకోవాలో తెలీదా.. ధోని భార్యపై విమర్శలు

First Published 1, Aug 2018, 2:42 PM IST
Highlights

సెలబ్రిటీ భార్య అయినంత మాత్రానా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటావా? నీకలు డ్రెస్సింగ్‌ సెన్సే లేదు' అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షికి సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.సాక్షి ఇటీవల తన స్నేహితురాలు, మాజీ కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్‌ సంగీత్‌ కార్యక్రమానికి భర్త ధోనితో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేసిన డ్రెస్సును ఆమె ధరించింది. అయితే, ఇప్పుడు ఆ డ్రెస్సు ధరించినందుకు గాను సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధోని భార్య సాక్షిని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

'ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో తెలీదా? అది అవసరమా? అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా మరొక నెటిజన్ సెలబ్రిటీ భార్య అయినంత మాత్రానా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటావా? నీకలు డ్రెస్సింగ్‌ సెన్సే లేదు' అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే సాక్షి వేసుకున్న డ్రెస్సు ఆమెకు చక్కగా నప్పిందని, మద్దుతుగా నిలిచిన వారు కూడా ఉన్నారు. ఆ ఫోటోలో ఎలాంటి తప్పు లేదని.. ట్రోల్‌ చేసే వాళ్ల ఆలోచనలే తప్పుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు

Last Updated 1, Aug 2018, 2:42 PM IST