భారత్‌కి రెండో స్వర్ణం... వెయిట్‌లిఫ్టింగ్‌లో గోల్డ్ గెలిచిన 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా...

By Chinthakindhi Ramu  |  First Published Jul 31, 2022, 4:11 PM IST

300 కేజీలు ఎత్తి, భారత్‌కి రెండో స్వర్ణం అందించిన భారత వెయిట్‌లిఫ్టర్, 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా... 2018 యూత్ ఓలింపిక్స్‌లో 274 కేజీలను ఎత్తి స్వర్ణం గెలిచి...


కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. 67 కేజీల మెన్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో భారత వెయిట్‌లిఫ్టర్, 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా, తన ఏకంగా 300 కేజీలు ఎత్తి... భారత్‌కి స్వర్ణం అందించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య ఐదుకి చేరింది...

స్నాచ్ రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలో 136 కేజీలు ఎత్తిన జెరెమీ లాల్రిన్నుంగా, ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలను విజయవంతంగా ఎత్తేశాడు. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో ఏకంగా 160 కేజీలను లిఫ్ట్ చేసిన జెరెమీ, మొత్తంగా 300 కేజీలతో టాప్‌లో నిలిచి, స్వర్ణం సొంతం చేసుకున్నాడు...

Latest Videos

undefined

2018 యూత్ ఓలింపిక్స్‌లో 274 కేజీలను ఎత్తి స్వర్ణం గెలిచిన జెరెమీ లాల్రిన్నుంగా, 16 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్స్‌లో పాల్గొన్నాడు. అయితే అందులో 67 కేజీల విభాగంలో పోటీపడిన జెరెమీ లాల్రాన్నుంగా, 21 ర్యాంకులో నిలిచి నిరాశపరిచాడు. అయితే 2020 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన జెరెమీ, కామన్వెల్త్‌ గేమ్స్‌లో మరోసారి సత్తా చాటి, భారత్‌కి రెండో స్వర్ణం అందించాడు...
 

Our Yuva Shakti is creating history! Congratulations to , who has won a Gold in his very first CWG and has set a phenomenal CWG record as well. At a young age he’s brought immense pride and glory. Best wishes to him for his future endeavours. pic.twitter.com/dUGyItRLCJ

— Narendra Modi (@narendramodi)

భారత్‌కి రెండో స్వర్ణం అందించిన జెరెమీ లాల్రిన్నుంగాని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘మన యువ శక్తి చరిత్ర సృష్టిస్తోంది. మొట్టమొదటి కామన్వెల్త్ పోటీల్లోనే స్వర్ణం గెలిచిన జెరెమీ లాల్రిన్నుంగాకి అభినందనలు. భారత దేశాన్ని గర్వించుకునేలా చేశావ్. నీ భవిష్యత్తు మరింత బాగుండాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశారు మోదీ...

కామన్వెల్త్ గేమ్స్ 2022లో తొలి రోజు భారత్‌ నాలుగు పతకాలు సాధించింది. ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి ఛాను గోల్డ్ మెడల్ గెలవగా పురుష వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గర్ రజతం గెలిచాడు. గురురాజ పూజారి కాంస్యం గెలవగా మరో మహిళా వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి దేవి రజతం గెలిచింది.

స్విమ్మింగ్‌లో 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పోటీపడిన భారత స్మిమ్మర్‌ శ్రీహరి నటరాజ్ 25.52 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని హీట్‌లో టాప్ 2లో నిలిచాడు. ఓవరాల్‌గా 8వ స్థానంలో నిలిచిన శ్రీహరి నటరాజన్, సెమీ ఫైనల్‌‌కి అర్హత సాధించాడు... 

200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో పోటీపడిన భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయాడు. 1:58.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న సజన్ ప్రకాశ్, 9వ స్థానంలో నిలిచి తృటిలో ఫైనల్ ఛాన్సును మిస్ చేసుకున్నాడు. టాప్ 8లో నిలిచిన స్విమ్మర్లు మాత్రమే ఫైనల్‌లో పోటీపడతారు.. 

 

click me!