Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలు -2022 తొలి రోజు తొలి ఆటను భారత్ విజయంతో బోణీ కొట్టింది. ఇండియా బాక్సర్ శివ్ థాప పాక్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌ను మట్టికరిపించాడు. బాక్సింగ్ తో పాటు టేబుల్ టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్ లో శుభారంభం చేసింది.
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022ను భారత్ విజయంతో ప్రారంభించింది. ఈ క్రీడలలో భాగంగా భారత్ ఆడిన తొలి మ్యాచ్ లో ఆసియా క్రీడల మాజీ ఛాంపియన్, బాక్సర్ శివ్ థాప.. పాకిస్తాన్ బాక్సర్ సులేమాన్ ను చిత్తుగా ఓడించి తదుపరి రౌండ్ కు దూసుకెళ్లాడు. రౌండ్ ఆఫ్ 32లో భాగంగా లైట్ వెల్టర్ వెయిట్ (63.5 కిలోలు) విభాగంలో పోటీపడిన శివ్.. 5-0 తో సులేమాన్ ను చిత్తుగా ఓడించి ప్రీ క్వార్టర్స్ కు అర్హత సాధించాడు.
సులేమాన్ ను ఓడించిన శివ్ థాప.. ఆదివారం స్కాట్లాండ్ బాక్సర్ రీస్ లించ్ తో తలపడనున్నాడు. గతంలో ఐదు సార్లు ఆసియా క్రీడలలో ఛాంపియన్ గా నిలిచిన శివ్.. ఈ గేమ్ లో ఆది నుంచి సులేమాన్ పై ఆధిపత్యం చెలాయించాడు.
undefined
శివ్ థాప పంచ్‌లకు పాకిస్తాన్ బాక్సర్ దగ్గర సమాధానం లేకపోయింది. టెక్నికల్ గా సులేమాన్ కంటే మెరుగ్గా ఉన్న శివ్.. తొలి బౌట్ లోనే విజయం సాధించడంతో భారత బాక్సర్లలో కొండంత ఆత్మ విశ్వాసం నింపాడు.
That's what you call a perfect start 👊
India's Shiv Thapa advances to R16 of with a commanding 5️⃣-0️⃣ win over 🇵🇰 Baloch Suleman | | pic.twitter.com/eOCt08TWpN
టేబుల్ టెన్నిస్ లో..
పురుషుల టేబుల్ టెన్నిస్ లో భారత జట్టు బార్బోడస్ తో పోటీ పడి గెలిచింది. భారత టీటీ ఆటగాళ్లు హర్మీత్ దేశాయ్-సతియన్ జ్ఞానశేఖర్ ల ద్వయం.. 3-0 తేడాతో కెవిన్ ఫేర్లీ, టైరీస్ నైట్ లపై విజయం సాధించారు. మూడు సెట్లలోనూ 11-9, 11-9, 11-4 భారత్ ఆధిపత్యం కొనసాగింది. మరో మ్యాచ్ లో అచంట శరత్ కమల్.. 11-5, 11-3, 11-3 తేడాతో రామన్ మ్యాక్స్వెల్ ను ఓడించాడు. మహిళల టీమ్ ఈవెంట్ లో మనిక బత్ర, రీత్ టెన్నిసన్, శ్రీజ ఆకుల లు 3-0 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించారు.
స్విమ్మింగ్ లో..
భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్.. పురుషుల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ స్విమ్మిత్ సెమీస్ కు అర్హత సాధించాడు. హీట్ 4 లో భాగంగా 54.68 సెకండ్లలో 100 మీటర్ల దూరాన్ని ఈది ఈ పోటీలలో నాలుగో స్థానం సంపాదించాడు.
సైక్లింగ్ లో..
సైక్లింగ్ లో భారత్ కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. 4000 మీటర్ల పర్స్యూట్ టీమ్ ఈవెంట్ లో భారత్ ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.