కామన్వెల్త్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లి...

By Chinthakindhi Ramu  |  First Published Aug 1, 2022, 5:22 PM IST

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 16-13 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్...


కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్, ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో మొట్టమొదటిసారిగా లాన్ బౌల్స్ ఈవెంట్‌లో భారత్ ఖాతాలో పతకం చేరడం ఖాయమైపోయింది. భారత లాన్ బౌల్స్ టీమ్‌లోని రూపా దేవి ట్రికీ, నయన్‌మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్... న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 16-13 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లారు...

మంగళవారం ఆగస్టు 2న సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది భారత వుమెన్స్ లాన్ బౌల్స్ టీమ్. లాన్ బౌల్స్ టీమ్‌లో ఉన్న భారత ప్లేయర్లు 33 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మహిళలే. వీరి సంగటు వయసు 37 ఏళ్లు. లాన్‌ బౌల్స్‌ ఈవెంట్‌లో బరిలో దిగుతున్న నయన్‌మోనీ సైకియా వాస్తవానికి ఓ ప్రొఫెషనల్ వెయిట్‌లిఫ్టర్...

India 🤝Lawn Bowls

A new love story in the making? 🤞 | pic.twitter.com/A5qF3ILmFc

— The Bridge (@the_bridge_in)

Latest Videos

undefined

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కి పతకాలు సాధించాలని ఆశపడిన నయన్‌మోనీ గాయపడడంతో బరువులు ఎత్తకూడదని ఆమెకు వైద్యులు సూచించారు. దీంతో లాన్ బౌల్స్ వైపు కెరీర్‌ని మలుచుకున్న నయన్‌మోనీ, భారత జట్టుని ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించింది...

సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తర్వాత భారత జట్టు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు. స్టేడియంలో జనాలు... ‘ఇండియా... ఇండియా’ అని తమను సపోర్ట్ చేస్తుంటే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు...

అలాగే జుడో 48 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత జుడోకా సుశీలా దేవి, మలైవీకి చెందిన హరీయెస్ బొన్‌ఫేస్‌ని ఓడించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. పురుషుల 60 కేజీల విభాగంలో పోటీపడిన భారత జుడో విజయ్ సింగ్ యాదవ్, తొలి రౌండ్‌లో మార్షియస్‌కి చెందిన విన్ల్సీ గంగయాని ఓడించి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు.

పురుషుల 81 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో పోటీపడిన భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్ సింగ్ తృటిలో పతకాన్ని మిస్ చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 143 కేజీలు ఎత్తిన అజయ్ సింగ్, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 176 ఎత్తి 319 కేజీలను లిఫ్ట్ చేశాడు...

అయితే ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచిన అజయ్ సింగ్, ఒక్క కేజీ తేడాతో కాంస్య పతకం గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్‌కి చెందిన క్రిస్ ముర్రే 325 కేజీలతో స్వర్ణం గెలవగా, ఆస్ట్రేలియాకి చెందిన కేజీల్ బ్రూస్ 323 కేజీలతో రజత పతకం గెలిచాడు. కెనడాకి చెందిన నికోలస్ వాకన్ 320 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు...

బాక్సింగ్‌లో పురుషుల 51 కేజీల విభాగంలో పోటీపడిన భారత బాక్సర్ అమిత్ పంగల్, సౌతాఫ్రికాకి చెందిన నమ్రీ బెర్రిపై 5-0 తేడాతో విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. 

click me!