2021 బీడబ్ల్యూఎఫ్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న లక్ష్యసేన్... ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయిన శ్రీకాంత్...
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో పీవీ సింధు బరిలో దిగడం లేదు. అయితే భారత టైటిల్ మాత్రం అడుగంటలేదు. దీనికి కారణం ఈ ఏడాది మన బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఉన్న ఫామ్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో లక్ష్యసేన్, మెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం సాధిస్తే... మెన్స్ డబుల్స్‌లో సాయిరాజ్‌సాత్విక్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ పసిడి పతకం నెగ్గారు. ఈ ఇద్దరితో పాటు కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీ ఫైనల్‌లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్న భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి కూడా హాట్ ఫెవరెట్‌గా ఈ సారి బీడ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ బరిలో దిగుతున్నాడు...
గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరిన కిడాంబి శ్రీకాంత్, పసిడి పోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. 15వ సీడ్ ప్లేయర్‌గా 2021 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్స్‌లో అడుగుపెట్టిన కిడాంబి శ్రీకాంత్, అంచనాలకు మించి అద్భుత విజయాలు అందుకుని ఫైనల్ చేరాడు...
Up next 🔜 WORLD CHAMPIONSHIPS 🇯🇵
See you in Japan 🇯🇵 pic.twitter.com/7nAUGv17ir
undefined
అయితే ఫైనల్‌లో తన కంటే తక్కువ ర్యాంక్ ఉన్న 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్ ప్లేయర్ కిన్ యెతో జరిగిన మ్యాచ్‌లో 21-15, 22-20 తేడాతో పోరాడి వరుస సెట్లలో ఓడిపోయాడు కిడాంబి శ్రీకాంత్. ఈసారి గతంలో కంటే మెరుగైన సీడ్‌తో బరిలో దిగుతున్నాడు కిడాంబి శ్రీకాంత్... 11వ సీడ్ కిడాంబి శ్రీకాంత్, తొలి రౌండ్‌లో ఐర్లాండ్ ప్లేయర్, వరల్డ్ 39వ ర్యాంకర్ నాట్ గుయెన్‌తో తలబడబోతున్నాడు...
అలాగే 2021 బీడబ్ల్యూఎఫ్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న లక్ష్యసేన్, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఉత్సాహంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అడుగుపెడుతున్నాడు... ఈసారి కిడాంబి శ్రీకాంత్ కంటే టాప్ సీడ్‌గా 9వ ర్యాంకుతో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడబోతున్నాడు లక్ష్యసేన్...
All set for the World Championships in Tokyo 🇯🇵
Let's go! All in ⚡ pic.twitter.com/61M6zuoqTP
అలాగే 2019లో కాంస్యం గెలిచిన బీ సాయి ప్రణీత్ 19వ సీడ్‌గా, ప్రణయ్ 23వ సీడ్‌గా వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఆడబోతున్నారు. మెన్స్ సింగిల్స్‌లో మొత్తంగా 64 మంది ప్లేయర్లు పోటీపడబోతుంటే, వుమెన్స్ సింగిల్స్‌లో 48 మంది మాత్రమే పోటీలో ఉన్నారు...
మెన్స్ డబుల్స్‌లో 48 జోడీలు (96 మంది ప్లేయర్లు), వుమెన్స్ సింగిల్స్‌లో 48 జోడీలు, మిక్స్‌డ్ డబుల్స్‌లో 48 జోడీలు మొత్తంగా 400 మంది ప్లేయర్లు... బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.