టోక్యో ఒలింపిక్స్: కాంస్యం నెగ్గిన భజరంగ్ పూనియా... భారత్‌కి ఆరో పతకం...

By Chinthakindhi Ramu  |  First Published Aug 7, 2021, 4:25 PM IST

మెన్స్ ఫ్రీ స్టైయిల్ 65 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో కజికిస్తాన్‌కి చెందిన డౌలెట్ నియాజ్‌బెకావ్‌ను ఓడించిన భజరంగ్ పూనియా...


టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. దీంతో భారత పతకాల సంఖ్య ఆరుకి చేరింది. మెన్స్ ఫ్రీ స్టైయిల్ 65 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో కజికిస్తాన్‌కి చెందిన డౌలెట్ నియాజ్‌బెకావ్‌తో జరిగిన మ్యాచ్‌లో భజరంగ్ పూనియా 8-0 తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

మొదటి పీరియడ్ ముగిసే సమయానికి 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్నాడు భజరంగ్ పూనియా... ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లు సాధించి 8-0 తేడాతో మంచి ఆధిక్యంలోకి వెళ్లాడు. 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో డౌలెట్‌ చేతుల్లో ఓడిన భజరంగ్ పూనియా, రెండు నెలల క్రితం అతనిపై మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. 

Latest Videos

undefined

టోక్యో ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ అదితి అశోక్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. గోల్ఫ్‌లో నాలుగో స్థానంలో నిలిచి, అద్భుతం చేసింది. గోల్ఫ్‌లో టీమిండియాకి పెద్దగా ఆశలు లేవు. అయితే మూడు రౌండ్లు ముగిసేవరకూ టాప్ 2లో ఉన్న అదితి అశోక్, యావత్ భారతం దృష్టిని ఆకర్షించింది...

అయితే ఆఖరి రౌండ్‌లో కాస్త ఒత్తిడికి గురైన అదితి అశోక్... ఆఖరి షాట్‌ను మిల్లీమీటర్ తేడాతో మిస్ చేసుకుని, పతకాన్ని చేజార్చుకుంది. పతకం రాకపోయినా గోల్ఫ్‌లో టాప్ 4లో భారత ప్లేయర్ ఉండడం అంటే అసాధారణ ప్రదర్శనే.

అసలు గోల్ఫ్ అంటే ఎలా ఆడతారో కూడా తెలియని చాలామంది భారతీయులు, అదితి అశోక్ రెండో స్థానంలో ఉందని తెలిసి, టీవీల్లో ఆఖరి రౌండ్‌ను ఆసక్తిగా వీక్షించారు. ఇది అదితి అశోక్ సాధించిన ఘనతే. రియో ఒలింపిక్స్‌లో 41వ స్థానంలో నిలిచిన భారత గోల్ఫర్ అదితి అశోక్, ఈసారి 200వ ర్యాంకర్‌గా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ సీడెడ్ ప్లేయర్లకు చెమటలు పట్టించింది...

click me!