ఏషియన్ గేమ్స్ 2023: భారత్‌కి షూటింగ్‌లో మరో స్వర్ణం.. రజతం గెలిచిన గోల్ఫర్ అదితి అశోక్..

By Chinthakindhi Ramu  |  First Published Oct 1, 2023, 10:14 AM IST

ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల షూటర్ల టీమ్, రజతం గెలిచిన మహిళల టీమ్... గోల్ఫర్ అదితి అశోక్‌కి రజతం.. 


ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. ట్రాప్ మెన్స్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు పృథ్వీరాజ్ తోండెమన్, కెనన్ చెనయ్, జోరవర్ సింగ్ సధు 361 పాయింట్ల రికార్డు స్కోరు చేసి స్వర్ణం సాధించారు..

మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు మనీషా కేర్, రాజేశ్వరి కుమారి, ప్రీతి రజక్ 337 పాయింట్లు స్కోర్ చేసి రజత పతకం సాధించారు.

Latest Videos

undefined

భారత గోల్ఫర్ అదితి అశోక్, మహిళల వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది.  మొదటి నాలుగు రౌండ్లు ముగిసే సమయానికి రెండో స్థానంలో ఉన్న గోల్ఫర్ కంటే 7 షాట్ లీడ్ సాధించిన అదితి, ఆఖరి రౌండ్‌లో ప్రెషర్‌కి గురైంది. ఫలితంగా థాయిలాండ్ గోల్ఫర్ అర్పిచయ యుబోల్ టాప్‌లోకి దూసుకెళ్లి, స్వర్ణం సాధించింది..

🥇 Gold Rush Alert! 🥇

🇮🇳 Shooters Prithviraj Tondaiman, , and Zoravar Singh Sandhu have shot their way to GOLD in the Trap-50 Shots Team event! 🎯🇮🇳

Their precision, focus, and teamwork have brought glory to our nation. Let's… pic.twitter.com/qKhU2aksJT

— SAI Media (@Media_SAI)

అయితే ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కి పతకం తెచ్చిన మొట్టమొదటి గోల్ఫర్‌గా రికార్డు క్రియేట్ చేసింది అదితి అశోక్. ఇంతకుముందు 1982లో లక్ష్మనన్ సింగ్, భారత్‌కి గోల్ఫ్‌లో స్వర్ణం సాధించాడు. 41 ఏళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కి గోల్ఫ్ ఈవెంట్‌లో పతకం రావడం ఇదే తొలిసారి. 

ఇప్పటిదాకా ఏషియన్ గేమ్స్‌ 2023 పోటీల్లో భారత పతకాల సంఖ్య 41కి చేరింది. ఇందులో 11 స్వర్ణాలు, 16 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. 

click me!