రేసు వాకింగ్‌లో అమిత్‌కి రజతం.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో తొలిసారి భారత్ ఖాతాలో....

By Chinthakindhi Ramu  |  First Published Aug 21, 2021, 1:30 PM IST

10 వేల మీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన అమిత్...  2021 వరల్డ్ టీటీ కంటెండర్ బెడపెస్ట్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచిన భారత టీటీ ప్లేయర్లు మానికా బత్రా, సాతియన్ జ్ఞానశేఖర్..


నైరోబీలో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ అండర్20 ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ అమిత్ సంచలనం క్రియేట్ చేశాడు. 10 వేల మీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచిన అమిత్, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

వాస్తవానికి మొదటి రెండు లాప్స్ ముగిసే సమయానికి ప్రథమ స్థానంలో ఉన్న అమిత్, వాటర్ బ్రేక్ తీసుకోవడంతో కొన్ని సెకన్ల కాలాన్ని కోల్పోయి... రెండో స్థానానికి పడిపోయాడు...
42:17.94 సెకన్లలో రేసుని పూర్తి చేసిన అమిత్, స్వర్ణ పతకాన్ని సెకన్ల తేడాతో మిస్ చేసుకున్నాడు. 

🇮🇳's Amit wins 🥈in 10000m Race Walk with a time of 42:17.94 at the in Nairobi

This is the 1st time India has won a medal in Race Walking and 2 medals in a single edition of the Championships

Many congratulations Champ! pic.twitter.com/YJeXduaE5x

— SAIMedia (@Media_SAI)

Latest Videos

undefined

రేసు వాకింగ్‌లో భారత్‌కి దక్కిన మొట్టమొదటి పతకం ఇదే... అలాగే అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ ఒకే ఎడిషన్‌లో భారత్‌కి రెండు పతకాలు దక్కడం కూడా ఇదే తొలిసారి. ఇప్పటికే 4X400 మిక్స్‌డ్ రిలే టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు కాంస్య పతకాన్ని గెలిచిన విషయం తెలిసిందే... 

HISTORIC GOLD😍🇮🇳

What an amazing way to start the Mixed Doubles campaign with by becoming the first ever Indian Mixed pair to win an international world tour title💪💪 pic.twitter.com/4J54g9DcMd

— Sathiyan Gnanasekaran (@sathiyantt)

మరోవైపు 2021 వరల్డ్ టీటీ కంటెండర్ బెడపెస్ట్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్స్‌లో భారత టీటీ ప్లేయర్లు మానికా బత్రా, సాతియన్ జ్ఞానశేఖర్, నండో ఎక్సెకీ, డోరా మడరస్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-9, 9-11, 12-10, 11-6 తేడాతో గెలిచి టైటిల్ సాధించారు. భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో మిక్స్‌డ్ డబుల్స్ జోడీ దక్కిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ టైటిల్ ఇదే కావడం విశేషం.

click me!