పుల్వామా ఉగ్రదాడి.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

By ramya NFirst Published Feb 23, 2019, 11:10 AM IST
Highlights

పాక్ మాజీ కెప్టెన్ మియాందాద్.. భారత్ పై టీం ఇండియా మాజీ కెప్టెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

పాక్ మాజీ కెప్టెన్ మియాందాద్.. భారత్ పై టీం ఇండియా మాజీ కెప్టెన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43మంది భారత జవాన్లు అమరవీరులైన సంగతి తెలిసిందే. కాగా... ఈ ప్రభావం ప్రపంచకప్ పై పడింది. ప్రపంచకప్ లో పాక్ ను నిషేధించాలని కోరుతూ తాజాగా.. బీసీసీఐ.. ఐసీసీ లేఖ రాయాలని భావించారు.

ఈ విషయంపై పాక్ మాజీ కెప్టెన్  వియాందాద్ స్పందించారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. ఆ జట్టును ప్రపంచకప్ నుంచి నిషేధించాలని బీసీసీఐ భావిస్తోందని.. అది ఒక పనికిమాలిన చర్య అని ఆయ పేర్కొన్నారు.  బీసీసీఐ తీసుకునే నిర్ణయాలను ఐసీసీ సమ్మతించదన్నారు. ఐసీసీకి బీసీసీఐ మాటలు వినాల్సిన అవసరం లేదన్నారు. ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో దాని సభ్యత్వ దేశాలకు పాల్గొనే హక్కు ఉంటుందన్నారు.

అనంతరం టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై కూడా విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల కోసం గంగూలీ పరుగులు తీస్తున్నారని విమర్శించారు. గంగూలీ సీఎం కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రచారం కోసం గంగూలీ ఏదోదో మాట్లాడుతున్నారని  ఆరోపించారు. భారత చర్యలకు తాము చింతించడం లేదన్నారు. భారత్ తో మంచి సంబంధాల కోసం పాక్ ఎప్పుడూ ముందు ఉంటుందని.. కానీ భారతే  సరిగా స్పందించదన్నారు. 
 

click me!