నిపుణులు చేసిన పరిశోధనలో.. గంజాయి ఎక్కువగా తీసుకునేవారు ఆహారం ఎక్కువగా తింటారట. ఇతరులతో పోలిస్తే.. వారు ఆహారం ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఎక్కడ విన్నా.. డ్రగ్స్ పేరే వినపడుతోంది. పలువురు సినీ నటులు కూడా ఈ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో... ఈ డ్రగ్స్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. డ్రగ్స్ లో భాగంగా చాలా మంది యువత ఈ మధ్యకాలంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అన్న విషయం తెలిసిందే.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు అందరికీ తెలుసు. అయితే.. దీనికి ఒక్కసారి అలవాటుపడిన వారు దాని నుంచి బయటకు రాలేరు. ఈ నేపథ్యంలో.. నిపుణులు చేసిన పరిశోధనలో.. గంజాయి ఎక్కువగా తీసుకునేవారు ఆహారం ఎక్కువగా తింటారట. ఇతరులతో పోలిస్తే.. వారు ఆహారం ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది.
అంతేకాదు.. గంజాయి తీసుకునే అలవాటు ఉన్నవారికి ఇతరులతో పోలిస్తే.. 20శాతం అధికంగా శృంగార కోరికలు ఉంటాయని తేలింది. శృంగారంలో పాల్గొనాలనే కోరిక కూడా వారిలో ఎక్కుగా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. శృంగార కోరికలు పెంచినా.. సంతాన సమస్యలను మాత్రం తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి ఎక్కువగా తీసుకునేవారికి పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుందట.