పోలీస్ స్టేషన్ ఎదుట శృంగారం.. దంపతుల అరెస్ట్

By telugu news team  |  First Published Jun 1, 2020, 2:56 PM IST

స్టేషన్ బయటకు వచ్చి ఆ సన్నివేశాన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా పోలీస్ స్టేషన్ బయటే భయం లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి దగ్గరికి వెళ్లగా.. వారికి చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని మత్తులో ఉన్నారు.

పీకల్లోతు మద్యం సేవించి... ఓ జంట పోలీస్ స్టేషన్ ఎదుట శృంగారంలో పాల్గొన్నారు. తమ చుట్టూ ఏం జరుగుతోంది అన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు. వారు చేస్తున్నపని చూసి షాకైన పోలీసులు.. ఆ జంటను అరెస్టు చేసి జైల్లో పడేశారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఫ్లోరిడాకి చెందిన జంట గ్యారీ హిల్, క్రిస్టల్ లు అనే దంపతులు ఇటీవల పీకల దాకా మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. తాగిన మత్తులో ఏకంగా ఫ్లోరిడా పోలీస్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్ పక్కనే గ్యారీ హిల్, క్రిస్టల్ శృంగారంలో పాల్గొన్నారు. 

Latest Videos

స్టేషన్ బయటకు వచ్చి ఆ సన్నివేశాన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా పోలీస్ స్టేషన్ బయటే భయం లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి దగ్గరికి వెళ్లగా.. వారికి చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని మత్తులో ఉన్నారు.

వెంటనే వారిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశారు. యువతికి మత్తు మరీ ఎక్కువవడంతో కనీసం నడవలేని పరిస్థితి ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

click me!