ఈ బ్రేకప్ సెక్స్ అనేది ట్రెండ్ గా మారింది. ఎలాగూ విడిపోతున్నాం కదా అని... చివరగా కలయికలో పాల్గొంటున్నారు. దీని వల్ల కలిగే నష్టాలను మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఆ నష్టాలేంటో ఓసారి చూద్దాం.....
ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ చివరిదాకా కలిసి ఉండే అవకాశం ఈరోజుల్లో లేదనే చెప్పాలి. చాలా కొద్ది మంది మాత్రమే కలిసి ఉంటున్నారు. మరికొందరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నారు. అయితే... బ్రేకప్ తర్వాత కొందరు శృంగారంలో పాల్గొంటున్నారట. దీనినే బ్రేకప్ సెక్స్ అని కూడా పిలుస్తున్నారు. ఈ బ్రేకప్ సెక్స్ అనేది ట్రెండ్ గా మారింది. ఎలాగూ విడిపోతున్నాం కదా అని... చివరగా కలయికలో పాల్గొంటున్నారు. దీని వల్ల కలిగే నష్టాలను మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఆ నష్టాలేంటో ఓసారి చూద్దాం.....
అటాచ్మెంట్
undefined
మాజీ భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండటం వలన మళ్లీ వారిపై ఫీలింగ్స్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా... బ్రేకప్ తర్వాత... చాలా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. విడిపోవాలా వద్దా.. అనేక తికమకలో పడిపోతారు. మనసు వద్దు అని చెప్పినా.. తప్పక విడిపోతూ ఉంటారు.
ఫాల్స్ హోప్...
బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా సెక్స్ కోసం తరచూ కలుస్తూ ఉండటం వల్ల... మళ్లీ ఆ వ్యక్తితో కలిసి ఉండాలనే కోరిక ఎక్కువగా పెరుగుతుంది. అనవసరంగా ఫాల్స్ హోప్ క్రియేట్ అవుతుంది. అయితే... కలిసి ఉండాలనే భావన కేవలం ఒకరికి మాత్రమే కలిగి.. మరొకరికి కలగకపోతే.. తర్వాత నష్టపోతారు.
ఇన్ ఫెక్షన్ల ప్రమాదం...
విడిపోయినప్పటి నుండి రెండు పార్టీలు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లయితే, బ్రేకప్ సెక్స్ సమయంలో ముఖ్యంగా అసురక్షిత సెక్స్‌లో లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు సంక్రమించే ప్రమాదం ఉంది.
మానసిక అనారోగ్యం..
బ్రేకప్ సెక్స్‌లో నిమగ్నమవ్వడం వల్ల అనారోగ్యకరమైన ప్రవర్తనా విధానాలు శాశ్వతంగా ఉంటాయి. బ్రేకప్ తర్వాత మానసిక సమస్యలను ఎదుర్కొనడానికి మళ్లీ మాజీలతో శృంగారంలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారట. కానీ... వాటి వల్ల మరింత మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.