గల్ఫ్ నుండే ఎన్నికల ప్రచారం... టీఆర్ఎస్ ఎన్నారైల వినూత్న ప్రయత్నం

By Arun Kumar PFirst Published Nov 24, 2018, 6:11 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపించడమై లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన తెలంగాణ కార్మికులను ఎక్కువగా నివాసముండే బహ్రెయిన్ లోని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఎన్నారై నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విదేశాల నుండే తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ విధంగా మద్ధతు తెలపాలన్న దానిపై కార్మికులకు అవగాహన కల్పించారు. టీఆర్ఎస్ మిషన్ కాలింగ్ క్యాంపెయిన్ ప్రక్రియ ద్వారా ప్రచారం ఎలా చేయాలో వివరించారు.

బహ్రెయిన్ లో జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ ఎన్నారై ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, గంగాధర్ గుముళ్ల, సెక్రెటరీలు విజయ్ ఉండింటి, ప్రమోద్ బొలిశెట్టి, జాయింట్ సెక్రటరీ నేరెళ్ల రాజు, సాయన్న కొత్తూరు, రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బాజన్న, నర్సయ్య తలరి, గణేష్ నుకాల,మోసిస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాధారపు సతీష్ మాట్లాడుతూ... 60 ఏండ్లు అధికారంలో ఉండి ఇటు గల్ఫ్ కార్మికులను, అటు తెలంగాణ బిడ్డలను కష్టాలను పట్టించుకోని వారు ఇప్పుడు మహాకూటమి పేరుతో కొత్తనాటకం ప్రారంభించారని విమర్శించారు. ఇలా తామంతా ఉపాధి కోసం గల్ఫ్‌కు పోవడానికి కారణం కాంగ్రెస్ , టీడీపీ పార్టీల పాలనేనని ఆయన ఆరోపించారు. మహాకూటమి నాయకులు చెప్పే  మాయమాటలు నమ్మి వారికి అప్పగిస్తే మరోసారి మోసపోవడం ఖాయమని సతీష్ హెచ్చరించారు. 

సీఎం కెసిఆర్ తెలంగాణ బాహుబలి అని....60 ఏండ్ల లో కాంగ్రెస్, టిడిపిలు చేయని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో చేసి చూపించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని రీతిలో కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని...అందులో ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల కోసం ఏకంగా 50 కోట్లు కేటాయిచారని గుర్తుచేశారు.   నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కోరే కెసిఆర్‌కు అధ్యక్షడిగా వున్న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి బంఫర్ మెజారిటీలో గెలిపించాలని బోలిశెట్టి వెంకటేష్ కోరారు.    

click me!