ఇక ఆ యాడ్‌ను మైనర్లు ప్రలోభపెట్టేవారిని పట్టుకోవడం కోసం పోలీసులే ఉంచారో? ఏమో? తెలియదు కానీ ప్రదీష్ మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు.
అమెరికాలో ఓ భారతీయ వ్యక్తిని పదేళ్ల జైలు శిక్ష విధించారు. అతను చేసిన ఓ నీచమైన పని కారణంగా అతనికి అక్కడి న్యాయస్థానం శిక్ష విధించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే...
ప్రదీష్ జెహన్ సెల్వరాజ్(35) అనే భారత వ్యక్తి నెబ్రాస్కాలోని ఒమాహాలో నివాసం ఉండేవాడు. గతేడాది అగ్రరాజ్యం మొత్తం కరోనాతో అల్లాడుతున్న సమయంలో ప్రదీష్ మాత్రం మైనర్లతో శృంగారంలో పాల్గొనాలని తహతహలాడిపోడు. అంతే.. వెంటనే మైనర్ బాలికలను ట్రాప్ చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో 2020 అక్టోబరు 26- నవంబరు 4 మధ్య 15ఏళ్ల బాలికలను ట్రాప్ చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఆన్‌లైన్‌లో ఓ వ్యభిచార యాడ్‌ను చూసిన మనోడు వెంటనే స్పందించాడు. వెనుకముందు ఆలోచించకుండా ఆ యాడ్‌కు మెసేజ్ పెట్టాడు.
undefined
ఇక ఆ యాడ్‌ను మైనర్లు ప్రలోభపెట్టేవారిని పట్టుకోవడం కోసం పోలీసులే ఉంచారో? ఏమో? తెలియదు కానీ ప్రదీష్ మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు. ప్రదీష్ సందేశానికి ఓ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిణి 15 ఏళ్ల బాలికగా బదులిచ్చింది. దాంతో ఆ బాలికకు 80 డాలర్లు చెల్లించడానికి అంగీకరించాడు. అలాగే ఈ డబ్బుతో మరో 12 ఏళ్ల బాలికతోనూ ఓరల్ సెక్స్ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. వారిద్దరినీ ఒమాహాలో కలుసుకోవడానికి ప్రదీష్ ప్లాన్ చేశాడు. వారి కోసం మెక్‌డొనాల్డ్స్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకెళ్లాడు.
తీరా వారు కలుసుకోవాలనుకున్న చోటుకు వెళ్లిన తర్వాత మనోడికి చుక్కలు కనిపించాయి. ప్రదీష్ కంటే ముందే ఆ చోటుకు చేరుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రదీష్ నుంచి మెక్‌డొనాల్డ్స్ బ్రేక్‌ఫాస్ట్, కండోమ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు కటకటాల వెనక్కి నెట్టారు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో దోషిగా తేలిన ప్రదీష్‌కు చీఫ్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి రాబర్ట్ రొస్సిటర్ 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.