పర్యాటక రంగం అభివృద్ధి చెందే కొద్దీ, భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందుతున్నాయని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. యువ పర్యాటకులను ఆకర్షించి, తెలుగు సంప్రదాయాలన్ని మరింతగా ప్రాచుర్యం పొందేలా ఏపీ టూరిజం కృషి చేస్తోందని తెలిపారు.
విజయవాడ: పర్యాటక రంగం అభివృద్ధి చెందే కొద్దీ, భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందుతున్నాయని ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. యువ పర్యాటకులను ఆకర్షించి, తెలుగు సంప్రదాయాలన్ని మరింతగా ప్రాచుర్యం పొందేలా ఏపీ టూరిజం కృషి చేస్తోందని తెలిపారు.
విజయవాడలోని హరిత బెర్మ్ పార్క్ లో ప్రవాస భారతీయ పర్యాటక బృందంతో మంత్రి శనివారం సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో నవ్యాంధ్రలో టూరిజం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ముఖ్యంగా నవ్యాంధ్ర నిర్మాణం, అమరావతిపై సీఎం విజన్, ఇక్కడి పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం, బౌద్ధారామాల అభివృద్ధితో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని మంత్రి అఖిల ప్రియ వివరించారు.
undefined
ఈ సందర్భంగా
మంత్రి అఖిలప్రియ ప్రవాస యువ భారతీయ బృందంతో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
మా ఆహారం, ఆహార్యం ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. మా సంస్కృతీ సంప్రదాయాలు మీకెలాంటి అనుభూతిని ఇస్తున్నాయంటూ? ప‌్రవాస భారతీయ బృందాన్ని ప్రశ్నించారు.
నవ్యాంధ్రలో పర్యాటన తమకు మధురానుభూతిని కలిగిస్తోందని, ముఖ్యంగా ఇక్కడి పర్యాటక ప్రాంతాలను చక్కగా అభివృద్ధి చేస్తున్నారని ప్రతినిధులు కొనియాడారు. ప్రతిష్ఠాత్మకమైన విశాఖ బొర్రా గుహలు, అరకు అందాలు తమనెంతో ఆకర్షించాయని, అయితే ఇవన్నీ చూడాలంటే తమకు సమయం సరిపోవడం లేదన్నారు. ఆంధ్ర భోజనం, ఆహార పదార్ధాలు కూడా నచ్చాయని ప్రతినిధులు మంత్రికి వివరించారు.
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతీ ఏటా ఈ యువ ప్రవాస భారతీయ బృందం పర్యటనకు ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా ఈ యువ ప్రవాస భారతీయ పర్యాటక బృందం భారత్ లో పర్యటిస్తోంది. నవంబరు 24 నుంచి డిసెంబరు 14 వరకు వీరు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఫిజి, గయానా, నెదర్ ల్యాండ్, మైన్మార్, సౌతాఫ్రికా, శ్రీలంక, సురినామ్, తోబాగా, ట్రినిడాడ్లకు చెందిన ఈ యువ పర్యాటక బృందం అనుభవాలను మంత్రి అఖిల ప్రియ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.