అగ్రరాజ్యం.. అమెరికా.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే దేశమిది.. అటువంటి అమెరికాలో స్థిరపడాలని ఎవరికీ ఉండదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తున్నది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం.. అమెరికా.. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే దేశమిది.. అటువంటి అమెరికాలో స్థిరపడాలని ఎవరికీ ఉండదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తున్నది.
అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఆ దేశ చట్టసభ ప్రతినిధులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్, సెనెట్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టారు.
undefined
ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించని దాదాపు 40 వేల గ్రీన్ కార్డులను విదేశీ వైద్యులు, నర్సులకు తక్షణం జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో అమెరికా కాంగ్రెస్ ఇదే బిల్లును ఆమోదించినా జారీ కానీ గ్రీన్ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని తాజా బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉండటమే దీనికి కారణం.
ఇప్పటివరకు అమెరికాలో 12.85 లక్షల మందికి కరోనా బారిన పడగా, మరణాల సంఖ్య 77 వేలు దాటింది. ఈ నేపథ్యంలోనే చట్టసభ ప్రతినిధులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
దీ హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ రీ సైలెన్స్ యాక్ట్ ప్రకారం ఏళ్ల తరబడి వినియోగించకుండా ఉన్న గ్రీన్ కార్డులను జారీ చేసేందుకు అనుమతినిచ్చే అధికారి అమెరికా కాంగ్రెస్‌కు ఉంది. మంజూరైన వీసాలతో అక్కడికి వెళ్లిన పౌరులకు వైద్య సాయం అందించడంతోపాటు అమెరికాలో శాశ్వత నివాసం పొందొచ్చు.
also read:భద్రతకు బెస్ట్..5జీ టెక్నాలజీ కార్లు .. ఫ్యూచర్ వాటిదే
అమెరికా కాంగ్రెస్ చేసిన ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే, 25 వేల మంది నర్సులు, 15 వేల మంది వైద్యులు గ్రీన్ కార్డులు పొందడానికి అవకాశం ఉంది. వీరంతా కరోనాపై పోరులో భాగంగా వైద్యసేవలు అందించాలి. హెచ్-1 బీ, జే2 వీసాలపై ఉన్న భారత వైద్యులు, నర్సులకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడనున్నది.
అమెరికాలోని కంపెనీల్లో పని చేయడానికి విదేశీయులకు హెచ్-1 బీ వీసాలను మంజూరు చేస్తారు. ఏటా 10 వేల మంది ఉద్యోగులను వివిధ కంపెనీలు తీసుకుంటాయి. ముఖ్యంగా భారత్, చైనా నుంచి ఈ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి.
ఈ చట్ట రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రతినిధులు మాట్లాడుతూ ‘ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి అవకాశానని పరిశీలిస్తున్నాం. అయితే కరోనా వైరస్ మహమ్మారి దానంతట అది అంతర్ధానం కాబోదు. అమెరికాను వైద్య నిపుణుల కొరత వేధిస్తున్నది‘ అని పేర్కొన్నారు.