కిడాంబి శ్రీకాంత్ కు డిప్యూటి కలెక్టర్ ఉద్యోగం (వీడియో)

19, Apr 2018, 6:00 PM IST

గొల్లపూడి లోని భూ పరిపాలన కమిషనర్ కార్యాలయంలో ఈ రోజు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. భూపరిపాలనా కమిషనర్ అనిల్ చంద్ర పునేత  నుంచి ఆయన  ఈ మేరకు నియామక పత్రాలును అందుకున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించినందుకు ఇంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ప్రకటించారు.కిడాంబి శ్రీకాంత్ వంటి అగ్ర శ్రేణి క్రీడాకారుడు మా శాఖ లోకి రావటం సంతోషకరమని సిసిఎల్ ఎ పునేత వ్యాఖ్యానించారు. క్రీడల్లో రాణించినట్లుగానే ప్రభుత్వ ఉద్యోగంలో రాణించాలని కోరారు. శ్రీకాంత్ కు గుంటూరు జిల్లాలో శిక్షణ ఉంటుందని చెప్పారు. తాను కోరినట్లుగా నేను కోరినట్లు గుంటూరులో పోస్టింగ్ ఇచ్చినందుకు,తనకు ప్రభుత్వంలో సేవలందించే అవకాశం కల్పించినందుకు ఆయన ముఖ్యమంత్రికి  ధన్యవాదాలు చెప్పారు.