నెల్లూరులో ఢిల్లీ లింకుల కలకలం: కొత్తగా ఐదు కేసులు నమోదు

By telugu teamFirst Published Apr 17, 2020, 1:19 PM IST
Highlights

నెల్లూరు ఢిల్లీ మర్కజ్ లింకులు కలకలం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో తాజాగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు నగరంలోనే ఇప్పటి 25 కేసులు నమోదయ్యాయి.

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఢిల్లీ మర్కజ్ లింకులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64కు చేరుకుంది.  

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి నుంచే కోరనా వైరస్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. తాజాగా నమోదైన కేసులు అందుకు సంబంధించి సెకండ్ కాంటాక్టులని చెబుతున్నారు. నెల్లూరు నగరంలోనే 25 కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధి సోకి ఏపీలో 14 మంది మరణించారు. 

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13,500కు చేరుకుంది. మరణాలు 449కి చేరుకున్నాయి. మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారంనాడు ఒక్క రోజే 361 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదైన సంఘటనల్లో ఇది రెండోది

click me!