NOTA: 'నోటా' అంటే ఏమిటి? భారత్ లో ఎప్పడు అమల్లోకి వచ్చింది? నోటాకు ఎక్కు ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయా? 

By Rajesh Karampoori  |  First Published Mar 16, 2024, 1:59 PM IST

NOTA: నోటా అంటే ఏమిటి? దీన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది? ఎన్నికలను రద్దు చేస్తారా? ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం.


NOTA: ఈ పేరు చాలా మందికి పరిచయమే. ఓటేసిన.. ఓటు వేయబోతున్న ఓటర్లకు నోటా అనే పదం వినే ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంత విలువ ఉందో మనకు తెలుసు. మన రాతను మనమే మార్చుకునేందుకు విలువైన ఆయుధం ఓటు. అయితే..ఆ ఆయుధాన్ని వాడుకుంటే.. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్న వాళ్ళమవుతాం. కానీ, ఈ రోజు రాజకీయాల్లోకి ఎవరు వస్తున్నారు?

దొంగలు.. కిరాతకులు.. ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు.. బలమున్నవారు.. ఎన్నికల్లో నిలబడుతున్నారు.  నూటికి ఒక్కడుంటే ఒక్కడు కూడా నిజాయితీగా ఉన్న నాయకులు లేని రోజుడివి. అయినా.. బరిలో నిలిచిన వారిలో మంచి వాళ్ళని ఎన్నుకోక తప్పదు కదా.. ప్రజాస్వామ్యం నిలబడాలన్నా.. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా..  ఓటరు తన ఓటు హక్కును విధిగా ఉపయోగించుకోవాలి.

Latest Videos

undefined

అలాంటి సమయంలో కొద్దిమంది పార్టీని చూసి ఓటు వేస్తుంటే.. మరి కొంతమంది కులాన్ని చూసి ఓటేస్తున్నారు. మరికొంతమంది కళ్ళు మూసుకొని మతాన్ని చూసి ఓటేస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు నచ్చకపోతే..అభ్యర్థుల నేర చరిత్రులైతే.. స్థానిక సమస్యల కారణంగా ప్రజలు ఎవరికీ ఓటు వేయకూడదని చాలాసార్లు అనుకుని ఉంటారు. అయితే వారు తమ నిరసనను ఎలా వ్యక్తం చేయాలనే సందర్బంలో నోటా అనే ఓటింగ్ విధానాన్ని అభివృద్ధి చేసింది. 

నోటా అంటే ఏమిటి? 
 
ఎన్నికల బరిలో నిలబెట్టిన అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చని సందర్భంలో.. కొందరు ఓటర్లు కనీసం ఓటు వేయటం కూడా వృథానే అన్న అభిప్రాయంతో ఉంటారు. అలాంటి వారి కోసం భారత ఎన్నికల సంఘం.. నోటా అనే ఐఛ్చికాన్ని ప్రవేశపెట్టింది. NOTA అంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ (None Of The Above) అని అర్థం. 
  
నోటా ఎప్పుడు వచ్చింది?

పౌర హక్కుల సంస్థ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ .. నోటాకు మద్దతుగా పిల్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2013లో ఓటర్లకు నోటా ఆప్షన్‌ ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. దీంతో ఈవీఎంలలో నోటా అనేది మరో ఆప్షన్‌గా మారింది. అయితే.. ఈ నోటా బటన్‌ను ఈవీఎంలో అన్నింటి కంటే చివర కేటాయిస్తారు. ఈ విధంగా నోటాను ప్రవేశపెట్టిన పద్నాలుగో దేశంగా భారత్ అవతరించింది.

ఏయే దేశాల్లో నోటా అమల్లో ఉంది? 

భారతదేశానికి ముందు, అమెరికా, కొలంబియా, ఉక్రెయిన్, రష్యా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిన్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, చిలీ, స్వీడన్, బెల్జియం, గ్రీస్‌తో సహా 13 దేశాల్లో నోటా  అందుబాటులో ఉంది. వీటిలో కొన్ని దేశాలు నోటాను తిరస్కరించే హక్కును కలిగి ఉన్నాయి. అంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దు చేయబడుతుంది.  నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేరు.

భారతదేశంలో నోటా

మీ దేశంలో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దవుతాయని మీరు కూడా అనుకుంటే పొరపాటే. భారతదేశంలో తిరస్కరించే హక్కు నోటాకు లేదు. అంటే నోటాకు 99 ఓట్లు వచ్చి, ఒక అభ్యర్థికి 1 ఓటు కూడా వస్తే.. ఒక ఓటు వచ్చిన  అభ్యర్థినే విజేతగా పరిగణిస్తారు. 2013లో నోటా అమల్లోకి వచ్చిన తర్వాత.. నోటా ఓట్లను మాత్రమే లెక్కిస్తామని, రద్దు చేసిన ఓట్ల కేటగిరీలో ఉంచుతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ఫలితాలపై నోటా ప్రభావం ఉండదని తేలిపోయింది.

click me!