ముంబై లోకల్ ట్రైన్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ గ్యాంగ్ అందరూ చూస్తుండగా డ్రగ్స్ సేవించి వికృతి చేష్టలు చేసింది. ఈ క్రమంలో ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా దీనిని వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ముంబైలోని లోకల్ ట్రైన్ నుండి ఎప్పుడూ ఏదోక వీడియో వైరలవుతూనే ఉంటుంది. కానీ, తాజాగా ఓ షాకింగ్ వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కు బానిసైనా ఓ గ్యాంగ్ లోకల్ ట్రైన్ లో వికృతి చేష్టలు చేసింది. ఇతర ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రయాణికులందరూ చూస్తుండగానే.. ఎలాంటి భయం లేకుండా డ్రగ్స్ సేవిస్తూ.. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ గ్యాంగ్ లో ఆరుగురు యువకులతో పాటు ఓ అమ్మాయి కూడా ఉండడం గమనార్హం. ఈ ఘటనను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1న లోకల్ ట్రైన్‌లో డ్రగ్స్ తీసుకున్న ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
సమాచారం ప్రకారం..ADARSH7355 అనే పేరు గల ట్విట్టర్ (X) వినియోగదారుడు.. నాలాసోపరా స్టేషన్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా పేర్కొన్నారు. ముంబాయి లోకల్ ట్రైన్‌లో అందరూ చూస్తుండగా ఓ గ్యాంగ్ ఎలాంటి బెరుకు లేకుండా డ్రగ్స్ సేవిస్తుంది. ఈ గ్యాంగ్ లో ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి డ్రగ్స్ ఉన్నారని, అలాగే వారి జేబుల్లో మరిన్ని డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయని తెలిపారు. వారు నాలాసోపరా స్టేషన్‌లో ట్రైన్ దిగి వెళ్లిపోయినట్లు అతడు పేర్కొన్నారు. ఈ పోస్టును ముంబై పోలీసులకు కూడా ట్యాగ్ చేశాడు.
In Local train Guys Taking drugs they have Many drugs in pocket and they have Group of 6 guy and 1 Girls also In there They all Are Get AWAY in nalasopara station date 1/09/2023 time 1:25AM night 🌉 pic.twitter.com/9QjJS6LMsW
— ADARSH (@ADARSH7355)
undefined
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తున్నాయి. చాలా మంది వినియోగదారులు వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణీకుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై పోలీసు, రైల్వే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశారు. “ఇది రొటీన్. మీరు ముంబాయిలోని ఏదైనా మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తే రైలులో సిగరెట్లు, గుట్కా విక్రయిస్తారు. దీని తర్వాత జరిగే ఏకైక విషయం ఏమిటంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి సురక్షితంగా ఉండండి" అని రాసుకొచ్చారు. మరొకరు నెటిజన్ ఇలా పేర్కొన్నారు. "మన చట్టాలు అటువంటి కేసులన్నింటినీ చాలా సున్నితంగా పరిశీలిస్తాయి. కాబట్టి.. ఇది సాధారణమైన విషయమే. " అని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఫిర్యాదులపై రైల్వే అధికారులు స్పందించాలని మరికొందరూ పశ్చిమ రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ట్యాగ్ చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)ని డివిజన్ రైల్వే మేనేజర్ ఆదేశించారు. లోకల్ ట్రైన్‌లో డ్రగ్స్ తీసుకున్న ఆరుగురు యువకులు, ఓ బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ పోస్టులకు లుకౌట్ నోటీసును పంపినట్లు పశ్చిమ రైల్వే అధికారి తెలిపారు. ఈ యువకులు రైల్వే ప్రాంతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే.. నిందితుల గుర్తింపును బహిర్గతం చేయడంలో వారికి సహాయం చేయాలని, వారిని పట్టుకోవడానికి ముందుకు రావాలని రైల్వే అధికారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.