ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకతకు ఇవే నిదర్శనం : యూపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్

By Arun Kumar P  |  First Published Nov 13, 2024, 3:03 PM IST

ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPPSC) పోటీ పరీక్షా విధానంలో పలు మార్పులు చేసింది. ఈ మార్పులన్ని పరీక్షల్ని మరింత నిష్పక్షపాతంగా నిర్వహించడానికేనని చెబుతున్నారు.


లక్నో : ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్  (UPPSC) అన్ని పోటీ పరీక్షలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఈ క్రమంలో అభ్యర్థుల విజ్ఞప్తులను, కాలానుగుణంగా మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ వస్తోంది. ఇతర కమీషన్ల ఉత్తమ పద్ధతులు, నిపుణుల సూచనల ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తున్నారు.

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత కోసం యూపిపిఎస్సి పరిక్షా విధానంలో సంస్కరణలు చేపట్టింది. పోటీ పరీక్షల విద్యార్థుల ప్రయోజనాలను అత్యధిక ప్రాధాన్యతగా పరిగణిస్తున్న  యూపిపిఎస్సి ఈ మార్పులు చేసింది. ఇలా విద్యార్థుల అంచనాలు, ఆశలు, అవసరాలకు పూర్తి గౌరవం ఇస్తోంది. 

విద్యార్థుల విజ్ఞప్తి మేరకే స్కేలింగ్ సిస్టమ్ రద్దు

Latest Videos

undefined

అభ్యర్థుల సౌలభ్యం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రధాన పరీక్ష నుండి ఐచ్ఛిక సబ్జెక్టును తొలగించాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు యూపిపిఎస్సి ప్రతినిధి తెలిపారు. ప్రధాన పరీక్షలో అందరికీ ఒకే విధమైన ప్రశ్నపత్రం ఉండటం వల్ల అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయన్నారు. స్కేలింగ్ వల్ల హ్యుమానిటీస్ సబ్జెక్టులు, హిందీ మీడియం విద్యార్థుల మార్కులు తగ్గుతాయని... సైన్స్ సబ్జెక్టులు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల మార్కులు పెరుగుతాయని విద్యార్థులు తరచుగా ఫిర్యాదు చేసేవారని గుర్తుచేసారు. దీంతో. ఐచ్ఛిక సబ్జెక్టుల తొలగింపుతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. దీని ఫలితంగా విద్యార్థుల చిరకాల స్కేలింగ్ రద్దు డిమాండ్ నెరవేరి పారదర్శకత వచ్చిందన్నారు. 

గతంలో ప్రిలిమినరీ పరీక్షలో ఒక పోస్టుకు 13 రెట్లు అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేసేవారు... తాాజా సంస్కరణలలో భాగంగా దీన్ని 15 రెట్లు పెంచినట్లు యూపిపిఎస్సి తెలిపింది., తద్వారా ఎక్కువ మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఇక గతంలో ఇంటర్వ్యూలో ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను పిలిచేవారు. ఇప్పుడు ఒక పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తున్నారని వెల్లడించారు. 

రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకే పరీక్షా విధానంలో మార్పలు 

నార్మలైజేషన్ ఫార్ములాను పారదర్శకంగా విద్యార్థులకు అందించినట్లు యూపిపిఎస్సి ప్రతినిధి తెలిపారు. ఒకే నోటిఫికేషన్‌కు వివిధ రోజులు/షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించినప్పుడు  మూల్యాంకనం కోసం నార్మలైజేషన్ ప్రక్రియ అవసరమని తెలిపారు. దేశంలోని వివిధ ప్రతిష్టాత్మక నియామక సంస్థలు,కమీషన్లు మొదలైన వాటిలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. గౌరవనీయ కోర్టుల వివిధ తీర్పుల ద్వారా కూడా దీనిని వివరించారని తెలిపారు.

సుప్రీంకోర్టు నియమించిన రాధాకృష్ణన్ కమిటీ నీట్ (NEET) పరీక్ష కోసం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించాలని సిఫార్సు చేసింది... అదేవిధంగా పోలీస్ నియామక పరీక్ష కూడా అనేక షిఫ్టుల్లో నిర్వహించబడిందని తెలిపారు. మొత్తం వ్యవస్థలో మానవ జోక్యం తక్కువగా ఉండేలా చూస్తున్నట్లు కమీషన్ ప్రతినిధి తెలిపారు. ప్రతిదీ సిస్టమ్ ఆధారితం. సాంకేతికతను ఉపయోగించి వ్యవస్థను సరళంగా,పారదర్శకంగా మార్చామని తెలిపారు. మూల్యాంకనంలో రోల్ నంబర్‌ను నకిలీ నంబర్‌గా మార్చి నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతారు... తద్వారా ఏ అభ్యర్థి రోల్ నంబర్ కూడా తెలియదు కాబట్టి మూల్యాంకన ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని యూపిపిఎస్సి ప్రతినిధి వివరించారు.

నార్మలైజేషన్ విషయంలో యూపిపిఎస్సి అభ్యర్థుల సూచనలను స్వాగతిస్తుందని, ఎవరికైనా మెరుగైన వ్యవస్థ కోసం ఏవైనా సూచనలు ఉంటే, వారు ఇవ్వవచ్చని కోరారు. ఇలాంటి సూచనలను నిపుణుల కమిటీ ముందు ఉంచుతామని... పారదర్శకత, నాణ్యత, అభ్యర్థుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయోగ్ ప్రతినిధి తెలిపారు.

నిష్పక్షపాతమైన, పారదర్శకమైన ఇంటర్వ్యూ ప్రక్రియ

ఇంటర్వ్యూలో ఎంపిక ప్రక్రియలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యత పాటిస్తున్నట్లు... నిష్పక్షపాతం, పారదర్శకతను నిర్ధారించడానికి ఈ క్రింది ప్రక్రియను అనుసరిస్తున్నట్లు యూపిపిఎస్సి ప్రతినిధి తెలిపారు.

(1) ఇంటర్వ్యూ ప్రక్రియ కోడింగ్ ఆధారితం, దీనిలో అభ్యర్థుల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లు, కేటగిరీని దాచిపెడతారు. ఈ విధంగా అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు ఇంటర్వ్యూ బోర్డుకు తెలియవు.

(2) ప్రతి అభ్యర్థికి ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన యాదృచ్ఛిక కోడ్ ద్వారా అభ్యర్థికి చివరి నిమిషం వరకు ఏ ప్యానెల్ ముందు హాజరు కావాలో తెలియదు.

(3) ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కోసం ఇంటర్వ్యూ బోర్డు ఇద్దరు సభ్యులతో ఉంటుంది.

(4) మొదటి, రెండవ సెషన్‌లలో వేర్వేరు ఇంటర్వ్యూ బోర్డులు ఉంటాయి.

(5) ఇంటర్వ్యూలో ప్రముఖ నిపుణులను ఆహ్వానిస్తారు.

(6) ప్రతి సెషన్ తర్వాత నిపుణులను ఇంటర్చేంజ్ చేస్తారు.

(7) అభ్యర్థుల ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వబడుతుంది. సగటు సూత్రం ఆధారంగా మార్కులు ఇవ్వబడతాయి.

(8) ఇంటర్వ్యూ తర్వాత మార్క్‌షీట్‌పై నిపుణులు సంతకం చేస్తారు. వారి సమక్షంలోనే మార్క్‌షీట్ ఎన్వలప్‌ను సీలు చేస్తారు.

(9) ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడిన నిపుణుల గుర్తింపును అత్యంత గోప్యంగా ఉంచుతారు.

జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పటిష్టం చేశారు

యూపి పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే పరీక్షల్లో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా పటిష్టం చేసినట్లు తెలిపారు. పారదర్శక మూల్యాంకనం కోసం కాపీలపై రోల్ నంబర్ స్థానంలో ప్రత్యేక కోడ్ ఉంటుంది... తద్వారా ఎవరి కాపీని సరిచూస్తున్నారో మూల్యాంకనం చేసేవారికి తెలియదన్నారు. మూల్యాంకనం చేసేవారు  ఒక రోజులో 25 కంటే ఎక్కువ కాపీలు సరిచూడకుండా చూస్తారు. ప్రతి పరీక్షకుడు 25 కాపీలను మూల్యాంకనం చేసిన తర్వాత, ఒక నిపుణుడు మరొక నిపుణుడి కాపీలను క్రాస్ చెక్ చేస్తారు, ఆ తర్వాత ప్రధాన పరీక్షకుడు తనిఖీ చేసి, మూల్యాంకనం చేసిన కాపీలు దోషరహితంగా, నాణ్యమైనవని ధృవీకరిస్తారు.

దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వ్యవస్థ  

ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిష్పక్షపాత ఎంపిక కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రయోజనం కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వ్యవస్థను ప్రవేశపెట్టింది. 22 నెలల్లో దాదాపు 19,34,027 మంది OTR నమోదు చేసుకుని ప్రత్యేక నంబర్ పొందారు. ఇప్పటివరకు దాదాపు 19.5 లక్షల మంది అభ్యర్థులు OTR నంబర్ పొందారు, ఇప్పుడు వారు 40 సంవత్సరాల వయస్సు వరకు అవసరమైన/అర్హత వివరాలను మాత్రమే పూరించి, కమీషన్ జారీ చేసిన ఏదైనా నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ పారదర్శకత, నాణ్యతతో పరీక్షా ప్రక్రియను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పరీక్షల పారదర్శకత విషయంలో, స్వయం-ఆర్థిక సహాయం పొందే పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఉంచకూడదని, పరీక్షా కేంద్రాలు జిల్లా కేంద్రాలకు చాలా దూరంలో ఉండకూడదని అభ్యర్థులు గట్టిగా చెప్పారని కమీషన్ ప్రతినిధి తెలిపారు. అభ్యర్థుల ఈ విజ్ఞప్తి సబబైనదే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 15 పరీక్షలు షెడ్యూల్ చేయబడ్డాయి, వీటిలో ఇప్పటివరకు 12 పరీక్షలు నిర్వహించబడ్డాయి, డిసెంబర్ నాటికి 14 పరీక్షలు (93.34%) నిర్వహించబడతాయి.

ఎంపిక ప్రక్రియను నాణ్యతతో,  సకాలంలో పూర్తి చేసాం-  యూపిపిఎస్సి

గణాంకాలను పరిశీలిస్తే నియామక కమీషన్ నాణ్యతతో సకాలంలో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. గత సంవత్సరాల్లో జరిగిన నియామకాల గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయి.

1) 2021-22లో 3620 వైద్య అధికారుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన 5 నెలల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

2) 2022-23లో PCS పరీక్ష 2022 (మూడు దశల పరీక్ష - ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ కేవలం 10 నెలల్లో పూర్తయింది.

3) 2023-24లో PCS పరీక్ష 2023 (మూడు దశల పరీక్ష - ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ కేవలం 6 నెలల 9 రోజుల్లో పూర్తయింది.

4) 2023-24లో PCS (J) పరీక్ష 2022 (మూడు దశల పరీక్ష - ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ కేవలం 6 నెలల 15 రోజుల్లో పూర్తయింది.

5) 2023-24లో దంతవైద్యుల తుది ఫలితాలు ఇంటర్వ్యూ పూర్తయిన 24 గంటల్లోనే ప్రకటించారు.

6) 2024-25లో 2532 గ్రేడ్-2 వైద్య అధికారుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన 2 నెలల 15 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయింది.

click me!