182 మంది స్త్రీలతో సంబంధం.. రహస్యంగా వీడియోలు తీసి..

By telugu teamFirst Published Jan 30, 2020, 12:27 PM IST
Highlights

ఆదిత్య, ఆనిష్ లు అమ్మాయిలకు గాలెం వేస్తారు. ప్రేమించామంటూ నమ్మిస్తారు. తాము చెప్పిన చోటుకి రావాలని వారికి చెబుతారు. వారి ప్రేమ నిజమని నమ్మిన యువతులు అక్కడికి రాగానే.. వారితో రొమాన్స్ చేస్తారు. అయితే... ముందుగానే అక్కడ కనిపించకుండా సీక్రెట్ గా కెమేరాలు ఏర్పాటు చేస్తారు.

ప్రేమ పేరిట మోసం చేయడం... లేదా బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బెదిరించడం లాంటి వార్తలు చూసే ఉంటారు. అయితే... వాటిని మించి ఇద్దరు వ్యక్తులు చేసిన స్కాం తెలిస్తే ఎవరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. దాదాపు 182మంది మహిళలను మోసం చేసి వీడియోలు తీసి ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు రూ.10లక్షలు వసూలు చేశారు. కాగా... ఓ మహిళ ఫిర్యాదుతో వీరి భండారమంతా బయటకు వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కలకత్తాకు చెందిన ఆదిత్య అగర్వాల్, ఆనిష్ లోహారుకా అనే ఇద్దరు యువకులు ఈ స్కీం సూత్రదారులు. ఇద్దరూ మంచి వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడం గమనార్హంం. ఆదిత్య కుటుంబం వస్త్ర వ్యాపారంలో మంచి పేరుండగా... ఆనిష్ కుటుంబం హోటల్స్ రంగంలో రాణిస్తోంది.

అయితే... ఈ ఇద్దరూ కలిసి కైలాష్ యాదవ్ అనే వ్యక్తిని తమ గ్యాంగ్ లో చేర్చుకున్నారు. ముందుగా  ఆదిత్య, ఆనిష్ లు అమ్మాయిలకు గాలెం వేస్తారు. ప్రేమించామంటూ నమ్మిస్తారు. తాము చెప్పిన చోటుకి రావాలని వారికి చెబుతారు. వారి ప్రేమ నిజమని నమ్మిన యువతులు అక్కడికి రాగానే.. వారితో రొమాన్స్ చేస్తారు. అయితే... ముందుగానే అక్కడ కనిపించకుండా సీక్రెట్ గా కెమేరాలు ఏర్పాటు చేస్తారు.

ఆ తర్వాత ఆ వీడియోలను తీసి కైలాష్ కి ఇచ్చేస్తారు. కైలాష్ ఆ వీడియోలను తర్వాత కొద్ది రోజులకు సదరు మహిళలకు పంపించి.. రూ.10లక్షలు ఇవ్వకుండా మీ బంధువులకు పంపిస్తానంటూ బెదిరించడం మొదలుపెడతాడు. బయపడి ఆ మహిళలు అతను అడిగిన డబ్బు ఇచ్చేస్తాడు. ఇలా కొంతకాలంగా వీరు చాలా మంది స్త్రీలను మోసం చేయడం విశేషం.

Also Read ప్రియురాలిపై సామూహిక అత్యాచారయత్నం.. స్థానికుల దేహశుద్ధి...

తాజాగా... ఓ మహిళను కూడా ఇలానే బెదిరించారు. ముందు రూ.5లక్షలు కావాలని అడిగారు. అవి ఆమె ఇవ్వగానే మరో రూ.10లక్షలు కావాలని బెదిరించాడు. దీంతో అంత డబ్బు ఇవ్వలేక సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు వీరి వ్యవహారం తెలిసి కంగుతిన్నారు.

వీరు చేసే స్కామ్ చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. వీరి వద్ద ఉన్న ల్యాప్ టాప్ చెక్ చేయగా దాదాపు 182మంది వీడియోలు ఉన్నాయి. ఒక్కో వీడియోలో ఒక్కో మహిళ ఉండటం గమనార్హం. ఇంత మంది మహిళలను మోసం చేసినట్లు నిందితులు అంగీకరించారు. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇటీవల కోర్టులో హాజరు పరచగా.. వారిని పోలీస్ కస్టడీకి తరలించారు. 

click me!