తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:26 PM (IST) Aug 21
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. మునుగోడు బహిరంగ సభ వేదిక నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్న అమిత్ షాకు రామోజీరావు ఘనస్వాగతం పలికారు. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
08:44 PM (IST) Aug 21
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు వున్నాయి.
07:50 PM (IST) Aug 21
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై బీజేపీ ఎంపీ పర్వేష్ సింగ్ సాహేబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం ఫ్యామిలీ వుందన్నారు. ఎక్సైజ్ కమీషనర్, ఢిల్లీ ఢిప్యూటీ సీఎం, లిక్కర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు , కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా హోటల్ రూమ్ డీల్‌లో వున్నారని ఆరోపించారు.
07:05 PM (IST) Aug 21
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు. మునుగోడులో జరిగిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ ఎన్నికల హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు. మరోసారి టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సీఎం వుంటారని అమిత్ షా జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల వేళ దళితబంధు హామీ ఇచ్చారని.. కానీ అమలు జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు.
05:49 PM (IST) Aug 21
సోమవారం ఢిల్లీలో జరగనున్న రైతుల నిరసనలను దృష్టిలో వుంచుకుని నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్‌ను అరెస్ట్ చేశారు. అయితే తాము ఎవరికీ తలవంచేది లేదని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ- హర్యానా సరిహద్దుల వద్దా భారీగా పోలీసులు మోహరించారు.
05:07 PM (IST) Aug 21
ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అవసరమైతే ప్రత్యర్ధి పార్టీలతో కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవిని మోసం చేశారని.. కుళ్లు, కుతంత్రాలను ఆయన చూడలేకపోయారని పవన్ అన్నారు. అందుకే ప్రజారాజ్యం పార్టీ ఉండలేకపోయిందన్నారు.
04:20 PM (IST) Aug 21
ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్రం ప్రతిరోజూ ఉదయం సీబీఐ- ఈడీ గేమ్ మొదలుపెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాగైతే దేశం ఏం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
03:23 PM (IST) Aug 21
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి షాకిచ్చారు కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోనియాకు ఆనంద్ శర్మ ఆదివారం లేఖ రాశారు.
02:40 PM (IST) Aug 21
నిజామాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సూర్యప్రకాశ్, ఆయన భార్య అక్షయ, కూతురు ప్రత్యూష, కుమారుడు అద్వైత్‌లుగా గుర్తించారు. తొలుత భార్య, పిల్లలకు పురుగుల మందు తాగించిన సూర్యప్రకాశ్.. తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
02:08 PM (IST) Aug 21
మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు గాను తెలంగాణకు విచ్చేస్తోన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలికారు.
12:36 PM (IST) Aug 21
తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కలవనున్నట్లు సమాచారం. ఎన్టిఆర్ ను అమిత్ షా లంచ్ కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ ఆహ్వానాన్ని అంగీకరించి జూ. ఎన్టీఆర్ కేంద్ర హోంమంత్రిని కలవడానికి సిద్దంగా వున్నట్లు సమాచారం.
11:32 AM (IST) Aug 21
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (సోమవారం) దేశ రాజధాని డిల్లీలో పర్యటించనున్నారు. ఇటీవల నూతన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ లను ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు సమాచారం.
10:35 AM (IST) Aug 21
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా కేవలం 11,539 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా కేసుల కంటే రికవరీలే ఎక్కువగా వుండటంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,879 కు చేరింది.
09:48 AM (IST) Aug 21
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్యకు గురయ్యాడు. చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అబూబకర్ (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచిచంపారు. ఆర్థిక లావాదేవీలో ఈ దారుణ హత్యకు కారణంగా తెలుస్తోంది.
09:35 AM (IST) Aug 21
డిల్లి లిక్కర్ స్కాం కేసులో ఆప్ మంత్రి మనీశ్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సిసోడియా నివాసంలో సోదాలు నిర్వహించిన సిబిఐ తాజాగా లుకౌట్ నోటీసులు జారీచేసింది. డిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాను రెండుమూడు రోజుల్లో అరెస్ట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నవేళ దేశం విడిచి వెళ్లకుండా సిబిఐ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారాయి. సిసోడియాతో పాటు మరో
14 మందికి ఈ నోటీసులు జారీచేసింది సిబిఐ.