తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

09:39 PM (IST) Aug 01
2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. శనివారం ఒక్కరోజు 5.10 కోట్లు దాఖలు కాగా.. చివరి రోజైన ఆదివారం ఒక్కరోజులోనే 72 లక్షల రిటర్నులు దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు.
08:53 PM (IST) Aug 01
పత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి.. అనంతరం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
08:53 PM (IST) Aug 01
పత్రాచల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి.. అనంతరం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
08:02 PM (IST) Aug 01
ఆత్మహత్య చేసుకుని మరణించిన ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ఎల్లుండి జరగనున్నాయి. ఆమె మరణవార్త తెలుసుకున్న అమెరికాలో వున్న కుమార్తె, అల్లుడు భారత్‌కు బయల్దేరారు. అటు ఉమామహేశ్వరి కోరిక మేరకు ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు.
07:16 PM (IST) Aug 01
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మైనారిటీ గురుకల బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 20 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో పాఠశాలలోని 172 మంది విద్యార్ధులు, 30 మంది టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు.
05:09 PM (IST) Aug 01
మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హాస్పిటల్లోని పేషెంట్స్ ని ఇతర హాస్పిటల్స్ కి తరలిస్తున్నారు.
04:32 PM (IST) Aug 01
తెలంగాణ రైతులకు అంధించినట్లే చేనేత కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ అధించి అండగా నిలవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 80 వేలకు పైగా హ్యండ్లూమ్, పవర్ లూమ్ నేతకార్మికులు, వారి కుటుంబాలు లబ్ది పొందనున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేత కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించే ఉద్దేశంతోనే ఈ ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు
03:47 PM (IST) Aug 01
మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు వైద్య పరీక్షల అనంతరం స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. ఆదివారం రౌత్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
02:55 PM (IST) Aug 01
లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన తెలిపినందుకు కాంగ్రెస్ ఎంపీలు నలుగురిని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారి సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ స్పీకర్ ఓంబిర్లా నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్కం ఠాగూర్, రమ్యా హరిదాస్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి లకు తిరిగి లోక్ సభ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లభించింది. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి కోరగా సభ అందుకు ఆమోదం తెలిపింది.
02:23 PM (IST) Aug 01
ఉత్తరప్రదేశ్ లో శాసన మండలి ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార బిజెపి నుండి ఇద్దరు, ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ నుండి ఒకరు నామినేషన్లు దాఖలు చేసారు. బిజెపి నుండి ధర్మేంద్ర సింగ్, నిర్మలా పాశ్వాన్ నామినేషన్ దాఖలు చేసారు. ముఖ్యమంత్రి యోగి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ నుండి కీర్తి కోల్ బరిలోకి దిగారు.
01:21 PM (IST) Aug 01
గ్యాంగ్ స్టర్స్ నుండి బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు గన్ లైసెన్స్ మంజూరుచేసారు. ప్రాణాలకు ముప్పు వుండటంతో ఇటీవలే గన్ లైసెన్స్ కోసం సల్మాన్ దరఖాస్తు చేసుకోగా తాజాగా పోలీసులు మంజూరు చేసారు. బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ సెక్యూరిటీని పెంచిన పోలీసులు తాజాగా గన్ లైసెన్స్ కూడా ఇచ్చారు.
12:25 PM (IST) Aug 01
వివిధ సమస్యలపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో లోక్ సభలో ఇవాళ (సోమవారం) గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా వేసారు.
11:29 AM (IST) Aug 01
ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి మస్జిద్ వివాదం అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మస్జిద్ కమిటీ తరపున వాదిస్తున్న అభయ్ నాథ్ యాదవ్ గుండెపోటుతో మృతిచెందాడు.
10:29 AM (IST) Aug 01
ఈటల రాజేందర్ నేతృత్వంలోని తెలంగాణ బిజెపి చేరికల కమిటీ డిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక, మునుగోడు ఉపఎన్నికపై జెపి నడ్డా, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ తో ఈ కమిటీ చర్చించనున్నట్లు కానుంది. ఈటలతో పాటు డికె. అరుణ, ఎంపీ లక్ష్మణ్ నడ్డాతో భేటీ కానున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వర్చువల్ గా సమావేశం కానున్నారు. బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నాయకుల వివరాలను నడ్డాకు ఈటల అందించనున్నట్లు సమాచారం.
10:21 AM (IST) Aug 01
భారత్ లో మంకీ పాక్స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని పరిశీలిస్తూ... నివారణకు వెంటనే చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించేలా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది.
09:44 AM (IST) Aug 01
భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,464 మంది కరోనా బారినపడ్డారు. అలాగే కరోనాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న 39 మంది మృత్యువాతపడ్డారు.
09:29 AM (IST) Aug 01
యూకే వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత వెయిట్ లిప్టర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో భారత పలు పతకాలు సాధించగా 73 కేజీల విభాగంలో భారత వెయిట్ లిప్టర్ అచింత షెవులి చరిత్ర సృష్టించాడు. 313కేజీల (143కేజీ+170కేజీ) లు బరువు ఎత్తి మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో చేర్చాడు. ఈ సందర్బంగా అచింతకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు.
09:19 AM (IST) Aug 01
నేటి నుండి తెలుగు సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ వర్గాలు షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న ఈ నిర్ణయానికి పిల్మ్ చాంబర్ మద్దతు తెలిపింది.