కోల్‌కతా డాక్టర్ ఫోటోలు, వీడియోలే కాదు పేరును వాడొద్దు..: సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ వార్నింగ్

By Arun Kumar P  |  First Published Aug 20, 2024, 6:10 PM IST

పశ్చిమ బెంగాల్ యువ డాక్టర్ హత్యాచారం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. 


Kolkata Doctor : పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో మెడికోపై హత్యాచారం యావత్ దేశ ప్రజలను కలచివేస్తోంది. హాస్పిటల్లోనే యువ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యంపై స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని ... బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికన కూడా మెడికోకు మద్దతుగా అనేక పోస్టులు వెలుస్తున్నాయి.  అయితే ఇందులో కొన్నిరకాల పోస్టులపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ వైద్యురాలి హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమె పేరుతో పాటు ఫోటోలు, వీడియోలతో వార్తలు ప్రసారంచేయడం, సోషల్ మీడియాలో పెట్టడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బాధితురాలికి సంబంధించిన వివరాలను, ఫోటోలు, వీడియోల ప్రసారాన్ని నిలిపివేయాలని మీడియా సంస్థలను... సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. 

Latest Videos

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్యాచారం ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ(మంగళవారం) చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జెబి పర్దివాల, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బాధితురాలి వివరాలు, ఫోటోలు,వీడియోలను ప్రసారం చేయడంపై లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో వెంటనే బాధితురాలి వివరాలను, ఫోటోలు, వీడియోలను తొలగించాలని న్యాయమూర్తులు ఆదేశించారు.
 

click me!