Published : Aug 14, 2022, 09:12 AM ISTUpdated : Aug 14, 2022, 10:14 PM IST

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 

నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

09:01 PM (IST) Aug 14

మహేశ్ భగవత్, దేవేంద్ర సింగ్‌లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు. రాచకొండ  పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్‌లు రాష్ట్రపతి నుంచి పతకాలను అందుకోనున్నారు. 

08:09 PM (IST) Aug 14

శాఖలు కేటాయించిన షిండే.. ఫడ్నవీస్‌కు హోం, ఆర్ధిక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మంత్రిత్వ శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి, రవాణా, పర్యావరణ, విపత్తు నిర్వహణ, సమాచార ప్రజా సంబంధాలు తదితర శాఖలను సీఎం తన వద్దే వుంచుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోం, ఆర్ధిక, న్యాయ, గృహ నిర్మాణ, విద్యుత్ శాఖలను అప్పగించారు. 

07:21 PM (IST) Aug 14

వ్యాక్సినేషన్‌లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం : రాష్ట్రపతి

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని.. కరోనా కష్టకాలాన్ని అధిగమించామని, స్టార్టప్‌లు దూసుకెళ్తున్నాయని రాష్ట్రపతి అన్నారు. 

06:25 PM (IST) Aug 14

మునుగోడులో గెలిచేది బీజేపీయే : మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని.. ఈడీ బోడీలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే వుందని మంత్రి పేర్కొన్నారు. 

05:41 PM (IST) Aug 14

ఈజిప్టులో ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది సజీవదహనం

ఈజిప్టులో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని కైరోలోని కాప్టిక్ చర్చిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 41 మంది సజీవదహనమవ్వగా.. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇంబాబాలోని అబూ సెఫీన్ చర్చిలో ఈ ఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి వుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

04:58 PM (IST) Aug 14

విశాఖలో అగ్నివీర్ ర్యాలీ... తరలివచ్చిన అభ్యర్ధులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ కార్యక్రమంలో భాగంగా అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ విశాఖలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు  ర్యాలీ కొనసాగనుంది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తోన్న ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

04:13 PM (IST) Aug 14

మూడు దశాబ్ధాల తర్వాత కాశ్మీర్‌లో థియేటర్ ప్రారంభం

కాశ్మీర్‌లో దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత థియేటర్ ప్రారంభం కానుంది. ఐనాక్స్ సంస్థ శ్రీనగర్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. సెప్టెంబర్‌లో ఇది ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. అత్యాధునిక వసతులతో నిర్మిస్తోన్న ఈ ధియేటర్‌లో సీటింగ్ సామర్ధ్యం 520 సీట్లు. ఇందులో ఫుడ్ కోర్టులు, చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

03:39 PM (IST) Aug 14

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 6 కిలోమీటర్ల మేర క్యూ

వరుస సెలవులు, శ్రావణ మాసం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్‌లో వేచివున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో నిండిపోయాయి.

03:08 PM (IST) Aug 14

మునుగోడులో సీపీఎం మద్ధతు ఎవరికంటే

మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీకి మద్ధతివ్వాలన్న దానిపై స్పందించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు. ఏ పార్టీ బీజేపీని ఓడిస్తుందో ఆ పార్టీకి మద్ధతిస్తామని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో దీనిపై స్పష్టతనిస్తామని వీరభద్రం వెల్లడించారు. 
    
 

02:20 PM (IST) Aug 14

బీజేపీలోకి మంత్రి మల్లారెడ్డి అనుచరుడు

టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఘట్‌కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డితో పాటు ఘట్‌కేసర్ మండలానికి చెందిన ఇతర నేతలు, వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
    

12:37 PM (IST) Aug 14

ఈసారి ఆస్కార్ నామినేషన్ లో జూ. ఎన్టీఆర్... హాలీవుడ్ మ్యాగజైన్ వెల్లడి

ఈసారి ఆస్కార్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వుండే అవకాశం వుందని హాలీవుడ్ వార్తలను ప్రచురించే ''వెరైటీ మ్యాగజైన్'' వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయనను నామినేట్ చేసే అవకాశాలున్నాయని తెలిపింది. 
  

12:08 PM (IST) Aug 14

పాకిస్థాన్  లో ఘోర రోడ్డుప్రమాదం... 13మంది మృతి

పాకిస్థాన్  లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు, చెరకు లారీ ఢీకొని 13 మంది మృతిచెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 
 

10:22 AM (IST) Aug 14

భారత్ లో తాజాగా 14వేల కరోనా కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,092 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,16,861 లకు చేరాయి. 
 

09:59 AM (IST) Aug 14

రాకేష్ జున్ జున్ వాలా మృతి... ప్రధాని మోదీ సంతాపం

సక్సెస్ ఫుల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, ఇటీవలే ఎయిర్ లైన్ బిజినెస్  లోకి దిగిన రాకేష్ జున్ జున్ వాలా మృతిచెందాడు. ఆదివారం ఉదయం ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం, కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తంచేసారు. 
 

09:13 AM (IST) Aug 14

Agneepath Scheme... విశాఖలో అగ్నివీర్ ల నియామకం ప్రారంభం

భారత్ ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ల నియామక ప్రక్రియ ప్రారంభమయ్యింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ్టి (ఆదివారం) నుండి అభ్యర్థులకు శరీరధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు. 18 రోజులపాటు అంటే ఈనెల 31వ తేదీవరకు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అగ్నిపథ్ పథకంపై వివాదం కొనసాగిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియ జరుగుతున్న విశాఖ ఇందిరాగాంధీ స్టేడియంవద్ద భారీగా పోలీస్, ఆర్మీ సిబ్బందిని మొహరించారు.