మందుబాబుల కోసం మద్యం హోమ్ డెలివరీ చేయాలని సుప్రీం సూచన!

By Sree s  |  First Published May 8, 2020, 3:17 PM IST

భౌతిక దూరాన్ని పాటించేలా, లాక్ డౌన్ నియమాల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు మద్యం హోమ్ డెలివరీ వంటి ఆప్షన్స్ ను వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది సుప్రీంకోర్టు. 


మద్యం అమ్మకాల వల్ల ప్రజలు భౌతిక దూరం పాటించడంలేదని, తద్వారా ఈ కరోనా మరింత వ్యాపించే ఆస్కారముందని సుప్రీమ్ కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేసారు. 

దీన్ని విచారణకు స్వీకరించడానికి నిరాకరించిన కోర్టు, భౌతిక దూరాన్ని పాటించేలా, లాక్ డౌన్ నియమాల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు మద్యం హోమ్ డెలివరీ వంటి ఆప్షన్స్ ను వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది సుప్రీంకోర్టు. 

Latest Videos

ఈ కేసును విచారణకు స్వీకరించకుండా ఈ వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ... దీన్ని విచారణకు స్వీకరించేలేముకానీ, రాష్ట్రాలు మాత్రం హోమ్ డెలివరీని ఆశ్రయించోచ్చని తెలిపింది. 

పిటిషనర్ తరుఫున వాదించిన లాయర్ సాయిదీపక్ వాదిస్తూ... ప్రభుత్వం ఇలా మద్యం షాపులను తెరవడం వల్ల లాక్ డౌన్ నియమాల ఉల్లంఘన అవుతుందని, పలుచోట్ల ఈ మద్యం షాపుల ముందు గుమికూడిన జనాలను అదుపు చేయడానికి లాఠీ ఛార్జ్ కూడా చేస్తున్నారని అన్నారు. 

లాక్‌డౌన్‌ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చర్చలు కూడా జరుపుతోంది. ఇక నుంచి మద్యాన్ని కావాల్సిన వారి కోసం హోమ్ డెలివరీ చేయాలని యోచిస్తోంది.

భారత్‌లో మద్యం హోం డెలివరీకి సంబంధించి ఏ విధమైన చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ).. జొమాటో, ఇతర సంస్థలతో మద్యం హోం డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత హోం డెలివరీ.. బాధ్యయుత మద్యం వినియోగాన్ని ప్రొత్సహించినట్టు అవుతుందని నమ్ముతున్నట్టు జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా.. ఐఎస్‌డబ్ల్యూఏఐ ముందు ప్రతిపాదనను ఉంచారు. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల రెస్టారెంట్‌లు మూసివేయడంతో జొమాటో విభిన్నంగా నిత్యావసరాలు డెలివరీ చేయడం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే

click me!