Latest Videos

Cyber Crime: బరితెగిస్తున్న సైబర్ నేరగాళ్లు.. 88 వేలకు పైగా స్కామ్ లు.. రూ. 1775 కోట్లు లూటీ.. 

By Rajesh KarampooriFirst Published May 24, 2024, 5:56 PM IST
Highlights

Cyber Crime: భారత్ లో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాలు భారత్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. 

Cyber Crime: ఇటీవలీ కాలంలో భారత్ లో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాలు భారత్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. మరోవిధంగా చెప్పాలంటే..  కంబోడియా, మయన్మార్, లావోస్ ఇతర ఆగ్నేయాసియా  దేశాలు సైబర్ నేరాలకు కేంద్రాలుగా మారాయి.  ఈ క్రైమ్ గ్యాంగ్‌లు భారతదేశంలో ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఏటీఎం మోసాలు వంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి.  

సైబర్ నేరాలపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. వ్యవస్థీకృత నేరాలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత భద్రతా అధికారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ కమిటీలో హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సేవల విభాగం, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, టెలికమ్యూనికేషన్స్ శాఖ మరియు ఆర్థిక సాంకేతిక రంగానికి సంబంధించిన అధికారులు ఉంటారని తెలిపారు.  
 
45 శాతం సైబర్ నేరాలు ఆగ్నేయాసియా దేశాల నుంచే..  

దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో 46 శాతం ఆగ్నేయాసియా దేశాల నుంచే జరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల నుంచి సైబర్ నేరాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నట్లు రాజేష్ కుమార్ తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. సైబర్ నేరాలను అరికట్టడానికి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ స్కైప్ ఖాతాలు, గూగుల్, మెటాలోని ప్రకటనలు, SMS హెడర్‌లు, సిమ్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలు మొదలైన సైబర్ క్రైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీని కారణంగా.. గత నాలుగు నెలల్లో 3.25 లక్షల "మ్యూల్" ఖాతాలు  స్తంభింపజేయబడ్డాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలోనే 62,587 నేరాలు జరగగా..  ఇందులో పెట్టుబడి పేరుతో రూ.1,420 కోట్లు, 20,043 ట్రేడింగ్ స్కామ్‌ల ద్వారా  రూ.222 కోట్లు, 4,600 డిజిటల్  స్కామ్‌ల్లో రూ.120 కోట్లు, రొమాన్స్/డేటింగ్ స్కామ్‌ల ద్వారా రూ.13 కోట్లు లూటీ చేసినట్టు పేర్కొన్నారు.  

గతేడాదిలో పోల్చితే.. ఈ ఏడాది  మోసాలు పెరిగాయని భారతీయ జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నివేదించింది. ఈ నేపథ్యంలో దాదాపు 10,000 FIRలు నమోదయ్యాయని వెల్లడించింది. సరిహద్దుల వెంబడి కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్ల వల్ల ముప్పు ఎంత ఉందో ఈ గణాంకాలు  నొక్కి చెబుతున్నాయి. ఈ మోసాల్లో చైనా జాతీయుల ప్రమేయాన్ని విస్మరించలేమనీ, చాలా మంది చైనీస్ వ్యక్తులు ఈ స్కామ్ హబ్‌లలో పని చేస్తున్నారనీ, మోసాలకు పాల్పడుతున్న  అనేక అనుమానిత యాప్‌లు చైనీస్ భాషలో ఉన్నాయని వెల్లడించింది. ఇది ఆగ్నేయాసియాలోని సైబర్ నేరగాళ్లకు, చైనాకు మధ్య ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని సైబర్ నిపుణులు అంటున్నారు. 
 
వేల కోట్లు దోచుకున్నారు

ఈ సైబర్ నేరాలను అరికట్టే దిశగా గత ఏడాది జూలై నుండి 3,000 కంటే ఎక్కువ URLలు,595 మొబైల్ ఫోన్ యాప్‌లు బ్లాక్ చేయబడ్డాయి. గత రెండు నెలల్లో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్‌సైట్‌లు,  వాట్సాప్ గ్రూపులలో 5.3 లక్షల సిమ్ కార్డ్‌లు, 80,848 IMEI నంబర్‌లు నిలిపివేయబడ్డాయి. 3,401 చట్టవిరుద్ధమైన కంటెంట్‌లను తొలగించారు. వీటిలో తొలగించబడుతున్న 1,500 స్కైప్ ఐడిలు కూడా ఉన్నాయని రాజేశ్ కుమార్ చెప్పారు. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నుండి  జరుగుతున్న ఈ సైబర్ నేరాల్లో ప్రధానంగా పెట్టుబడి, గేమింగ్ , డేటింగ్ యాప్‌లు, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు మొదలైన వాటి ద్వారా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే..ఇటీవల  లావోస్, కంబోడియాలో ఉపాధి అవకాశాలను కోరుకునే భారతీయ పౌరులు సంభావ్య మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని MEA హెచ్చరించింది.

"కంబోడియా , ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉద్యోగాల కోసం ప్రయాణిస్తున్న భారతీయ పౌరులందరికీ, ఈ ప్రాంతంలో చాలా మంది నకిలీ ఏజెంట్లు పనిచేస్తున్నారని, భారతదేశంలోని ఏజెంట్లతో పాటు, ముఖ్యంగా సైబర్ నేరాలకు పాల్పడే స్కామ్ కంపెనీలకు ప్రజలను ఆకర్షిస్తున్నారని సలహా ఇస్తున్నారు. ఎవరైనా కంబోడియాలో ఉద్యోగంలో చేరే వారు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమోదించిన అధీకృత ఏజెంట్ల ద్వారా మాత్రమే చేయాలి" అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. 

click me!