RBI MPC 2023: ఐదు బ్యాంకుల‌కు ఆర్బీఐ బిగ్ షాక్.. ఒక బ్యాంకు లైసెన్స్ ర‌ద్దు

By Mahesh Rajamoni  |  First Published Dec 8, 2023, 4:07 PM IST

RBI: సహకార బ్యాంకులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కోరడా ఝులిపించింది. త‌మ నిబంధనలు ఉల్లంఘించడం, రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల నేప‌థ్యంలో నాలుగు బ్యాంకులకు భారీ జరిమానా విధించడంతో పాటు ఒక సహకార బ్యాంకు లైసెన్స్ ను కూడా రద్దు చేసింది.
 


RBI Action on Cooperative Banks: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మ‌రోసారి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న ప‌లు బ్యాంకుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. భారీ జ‌రిమానాలు విధంచ‌డంతో పాటు ఏకంగా ఒక బ్యాంకు లైసెన్స్ ను ర‌ద్దు  చేస్తూ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించడం, రెగ్యులేటరీ సమ్మతిలో లోపాల నేప‌థ్యంలో నాలుగు బ్యాంకులకు భారీ జరిమానా విధించడంతో పాటు ఒక సహకార బ్యాంకు లైసెన్స్ ను కూడా రద్దు చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. ఆర్బీఐ ప్రకారం.. ఈ బ్యాంక్ కార్యకలాపాలకు తగినంత మూలధనం లేదు, అలాగే, దానిని సంపాదించే అవకాశమూ లేదు. 

నాలుగు సహకార బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా..

Latest Videos

నాలుగు సహకార బ్యాంకులకు ఆర్బీఐ జరిమానాలు విధించింది. వాటిలో రాజర్షి షాహు కోఆపరేటివ్ బ్యాంక్, ప్రైమరీ టీచర్స్ కోఆపరేటివ్ బ్యాంక్, పటాన్ కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌లు ఉన్నాయి. వీటికి నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు ఫైనాన్షియల్ పెనాల్టీల‌ను విధించిన‌ట్టు పేర్కొంది.  మొద‌టి మూడు బ్యాంకుల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున జ‌రిమానా విధించింది. ఇక డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.10 వేల జరిమానా విధించారు. పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిబంధనలను రాజర్షి పాటించడం లేదని ఆర్బీఐ తెలిపింది. టీచర్స్ కోఆపరేటివ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా బంగారు రుణాలు మంజూరు చేసిందని పేర్కొంది. పటాన్ కోఆపరేటివ్ బ్యాంకు కేవైసీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలిపింది. ఇక డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నాబార్డు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైందని పేర్కొంది.

RBI Monetary Policy: క్రెడిట్ కార్డు, మ్యూచువల్ ఫండ్ చెల్లింపుల్లో కీల‌క మార్పులు.. ఆర్బీఐ సూచ‌న‌లు ఇవే

 

యూపీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఎందుకు ర‌ద్దు చేశారు?

సీతాపూర్ లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డిసెంబర్ 7 నుంచి తన కార్యకలాపాలను మూసివేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు మూసివేతకు, లిక్విడేటర్ నియామకానికి ఉత్తర్వులు జారీ చేయాలని ఉత్తరప్రదేశ్ కమిషనర్, రిజిస్ట్రార్ ను కోరారు. ఆర్బీఐ ప్రకారం, బ్యాంకుకు తగినంత మూలధనం లేదా సంపాదన అవకాశాలు లేవు. అందువల్ల, బ్యాంకును నడపడం దాని ఖాతాదారుల ప్రయోజనాలకు మంచిది కాదు. బ్యాంకు తన ఖాతాదారులకు పూర్తిగా చెల్లించడంలో విఫలమవుతుందని ఆర్బీఐ పేర్కొంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన తర్వాత ఖాతాలో జమ చేసిన రూ.5 లక్షల వరకు బీమా కింద లభిస్తుంది. ఇందులో వడ్డీ కూడా ఉంటుంది. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే తిరిగి ఇవ్వరు. బ్యాంక్ డేటా ప్రకారం, 98.32 శాతం మంది కస్టమర్లు మాత్రమే వారి పూర్తి డబ్బును పొందుతారు.

UPI యూజర్లకు గుడ్ న్యూస్.. చెల్లింపుల‌పై ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం

click me!