మరో దిశ ఎన్ కౌంటర్.. మైనర్ పై అత్యాచారం చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు...

By SumaBala BukkaFirst Published Mar 16, 2022, 11:28 AM IST
Highlights

మూడేళ్ల క్రితం దిశ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడిన నిందితులను ఆతరువాత పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు గౌహతిలో చోటు చేసుకుంది. 

గువాహటి :  దేశవ్యాప్తంగా ‘disha’లో పోలీసుల ఎన్ కౌంటర్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ ఎన్ కౌంటర్ తర్వాత తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో దోషులు అని తేలకముందే శిక్షిస్తారా? అని విమర్శలు కూడా వచ్చాయి. కావాలని తమ వారిని కాల్చి చంపారని అత్యాచార నిందితుల కుటుంబాలు కోర్టుకు కూడా ఎక్కాయి. పూర్వ విషయాలను పక్కన పెడితే తాజాగా disha encounter లాంటి ఘటనే ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని Guwahatiలో చోటుచేసుకుందని ఓ వార్తా సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అసోం పోలీసులు మంగళవారం రాత్రి ఎన్కౌంటర్ చేశారని వెల్లడించింది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సామూహిక లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన బికీ అలీ  తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు రాత్రి సమయంలో ప్రయత్నించాడని తెలిపారు.  ఈ క్రమంలో స్టేషన్లో పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నం చేయడంతో అలీ తమపై దాడి చేసినట్లు గువాహటి పోలీసులు వెల్లడించారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ అలీ వినకపోవడంతో ఆత్మరక్షణకోసం అతడిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. నిందితుడు దాడిలో ఇద్దరు మహిళా పోలీసులు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Latest Videos

కాగా, బికీ అలీ తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్ లోని ఓహోటల్ లో ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం తర్వాత వారంతా పారిపోయారని తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు  పాన్ బజార్  మహిళ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు బికీ గురించి సమాచారం తెలియడంతో అతడిని మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

కాగా, 2019 నవంబర్ 27న రాత్రి లో తెలంగాణ వైద్యురాలు దిశను రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

పోలీసులు కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై రాళ్లు రువ్వి తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. దాంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు నిందితులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలోనే శవ పంచనామా నిర్వహించారు వైద్యులు. శాంతి భద్రతల దృష్ట్యా దిశ నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ చేసిన ప్రదేశంలోనే గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పంచనామా నిర్వహించారు. 

శవ పంచనామా అనంతరం నాలుగు మృతదేహాలను ఫరుక్‌ నగర్‌, పొందుర్గు, నందిగామ, చౌదరిగూడ తహాశీల్ధార్ లకు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

click me!