Pregnant Gang Raped: దారుణం.. 8 నెలల గర్భిణిపై గ్యాంగ్ రేప్.. ఆపై పెట్రోల్ పోసి నిప్పు..

By Rajesh Karampoori  |  First Published Feb 18, 2024, 4:43 AM IST

Pregnant Woman Gang Raped: తరచూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఎనిమిది నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 


Pregnant Woman Gang Raped : నేటీ సమాజంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా కూడా రక్షణ లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీసుల్లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. నిత్యం ఏదో పరిస్థితిలో ఆమె లైంగిక వేధింపులకు గురవుతోంది.తాజాగా ఓ నిండు గర్భిణిపై ఆరుగురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. ఆ గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు. ప్రస్తుతం ఆ గర్భిణి 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ.. ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చోటు చేసుకుంది. 

అసలేం జరిగింది?
 
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్‌పురా గ్రామానికి చెందిన ఓ మహిళ అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్‌ఫ్రా గ్రామానికి చెందిన 32 ఏళ్ల సరోజ సఖ్‌బర్ భర్త సురేష్ సఖ్‌బర్‌పై అత్యాచారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో సురేష్ సఖ్బర్ ఈ నెలలో బెయిల్‌పై విడుదలయ్యాడు. భర్తపై ఉన్న కేసులో రాజీనామా చేసేందుకు సరోజ శుక్రవారం మధ్యాహ్నం చాంద్‌పురా గ్రామానికి చెందిన గౌతమ్‌ సఖ్‌బర్‌ ఇంటికి వెళ్లింది. సరోజ ఎనిమిది నెలల గర్భిణి.

Latest Videos

ఈ క్రమంలో బాధితురాలి గ్రామానికి చెందిన కొందరు, నిందితుడి ఇంటికి వచ్చారు. నిండు గర్భిణీ అయిన  సరోజపై దాడి చేసి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా.. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందులో ఆమె భర్త సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కాలుతున్న స్థితిలో మహిళ ఇంటి నుండి బయటకు వచ్చింది. ప్రజలు మంటలను ఆర్పే సమయానికి మహిళ తీవ్రంగా కాలిపోయింది.

మహిళను జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం గ్వాలియర్‌కు తరలించారు. గాయపడిన స్థితిలో, గౌతమ్ సఖ్బర్, రాకేష్, మదన తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆపై తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

click me!