రైల్వే స్టేషన్‌లోని టీవీ స్క్రీన్‌లలో పోర్న్ క్లిప్.. ఖంగుతిన్న ప్రయాణికులు.. వీడియోలు వైరల్

By Mahesh K  |  First Published Mar 20, 2023, 1:09 PM IST

బిహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో పోర్న్ క్లిప్ ప్లే కావడం దుమారం రేపింది. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మూడు నిమిషాల పాటు ఈ క్లిప్ ప్లే అయింది. దీంతో అక్కడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 


పాట్నా: బిహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో పోర్న్ క్లిప్ ప్లే అయింది. అడ్వర్టయిజ్‌మెంట్‌ ప్లే అయ్యే స్క్రీన్‌లలో మూడు నిమిషాల పాటు అడల్ట్ ఫిల్మ్ క్లిప్ రన్ అయింది. దీంతో ప్లాట్‌ఫామ్ పై ఉన్న మహిళలు, పిల్లలు సహా ప్రయాణికులు హతాశయులయ్యారు. కొందరు సిగ్గుతో తలదించుకున్నారు. ఇంకొందరు మరో వైపు వెళ్లిపోయారు. పోర్న్ క్లిప్ మూడు నిమిషాలు రన్ కావడంతో చాలా మంది స్క్రీన్‌లను, చుట్టూ పరిసరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్‌లలో పోర్న్ క్లిప్ ప్లే అయింది. ప్లాట్‌ఫామ్ పై ఉన్న ప్రయాణికులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లకు వారు ఫిర్యాదు చేశారు. 

Latest Videos

Also Read: రాహుల్ గాంధీని హీరోను చేయాల‌నుకుంటున్న బీజేపీ.. ప్ర‌ధాని మోడీకి ఆయ‌నే అతిపెద్ద టీఆర్పీ: మ‌మ‌తా బెన‌ర్జీ

జీఆర్‌పీ యాక్షన్ తీసుకోవడం ఆలస్యం కావడంతో ఆర్‌పీఎఫ్ వెంటనే ఆ టీవీ స్క్రీన్‌లలో యాడ్స్ రన్ చేసే కాంట్రాక్ట్ తీసుకున్న దత్తా కమ్యూనికేషన్‌ను కాంటాక్ట్ చేసింది. బహిరంగంగా ప్లాట్‌ఫామ్‌లపై ఆ టీవీ స్క్రీన్‌లలో అడల్ట్ క్లిప్‌లు ప్లే అవుతున్నాయని, వాటిని వెంటనే ఆఫ్ చేయాలని ఆపరేటర్లకు సూచించించాల్సిందిగా ఏజెన్సీని ఆదేశించింది. 

देश में चल रहे अमृतकाल में आनंद और मज़ा इस प्रकार हतप्रद करते हुए दिया जा रहा है कि पटना रेलवे स्टेशन में अचानक पोर्न फिल्म दिखाई जाने लगी।क्योंकि फलाना है तो मुमकिन है। pic.twitter.com/pO0Suy4PmD

— Kunal Shukla (@kunal492001)

ఆ తర్వాత రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. దత్తా కమ్యూనికేషన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైల్వేస్ ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్ చేసింది. జరిమానా కూడా విధించింది. ఆ ఏజెన్సీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నట్టు సమాచారం. రైల్వే శాఖ ఈ ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నది. కాగా, ఆ పోర్న్ క్లిప్‌లు కేవలం ప్లాట్‌ఫామ్ నెంబర్ 10పైనే ఎందుకు ప్లే అయ్యాయని కొందరు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

click me!