Supreme Court: పాకిస్తానీ కళాకారులపై బ్యాన్ విధించాలి: పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

By Mahesh K  |  First Published Nov 28, 2023, 7:28 PM IST

పాకిస్తానీ కళాకారులు మన దేశంలో పని చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఘాటుగా వ్యాఖ్యానించి బాంబే హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే పిటిషన్ పై సుప్రీంకోర్టు కూడా సీరియస్  కామెంట్లు చేసింది.
 


న్యూఢిల్లీ: పాకిస్తానీ కళాకారులు మన దేశంలో పని చేయకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌పై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆ హైకోర్టు పిటిషన్ పై చేసిన వ్యాఖ్యలనైనా ఖండించాలని కోరగా.. నిరాకరించింది.

భారత పౌరులు, కంపెనీలు, సంస్థలు, అసోసియేషన్లు పాకిస్తానీ కళాకారులు, సినీ కార్మికులు, గాయకులు, గేయ రచయితలు, టెక్నీషియన్లకు పనులు ఇవ్వొద్దని, వారి సేవలను ఏ రూపంలోనూ వినియోగించవద్దని, అలాంటి ఆదేశాలను కేంద్రం వెలువరించాలని ఆ పిటిషన్‌ పేర్కొంది.

Latest Videos

undefined

దీనిపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీన్ భట్టిల ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి అప్పీల్ చేయకూడదని తెలిపింది. ఇంత సంకుచిత మనస్తత్వంతో ఉండవద్దని సూచించింది.

ఈ పిటిషన్ పై బాంబే హైకోర్టు ఇంకా ఘాటుగా స్పందించింది. ఒకరు దేశ భక్తుడిగా ఉండటానికి వేరే దేశస్తుల పట్ల శత్రుస్వభావంతో ఉండాల్సిన అవసరం లేదని వివరించింది. దేశ భక్తుడు సెల్ఫ్‌లెస్‌గా ఉంటారని, దేశానికి ప్రయోజనకర పనులు నిస్వార్థంగా చేస్తుంటారని తెలిపింది.  మంచి మనస్సుతో దేశం కోసం పాటుపడతారని వివరించింది. ఇతర దేశస్తులతోనూ సామరస్యంగా, శాంతియుతంగా మసలుకుంటారని పేర్కొంది.

Also Read: Animal: అంతటా తెలుగోళ్లే ఏలుతారు.. హైదరాబాద్‌కు రావాల్సిందే: రణ్‌బీర్ కపూర్‌పై మంత్రి మల్లారెడ్డి సంచలనం

కళలు, సంగీతం, క్రీడలు, సంస్కృతి, నృత్యం వంటివి జాతీయత, సంస్కృతులు, దేశాలకు అతీతమైనవని, ఆ హద్దులు దాటి ఉండేవని బాంబే హైకోర్టు వివరించింది. క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ కూడా పాకిస్తాన్ జట్టును పాల్గొనడానికి అవకాశం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

click me!