జాతీయ బాలికా దినోత్సవం 2024: బాలికలకు ఐదు రకాల స్కాలర్ షిప్ లు, మీరు కూడ పొందొచ్చు

By narsimha lode  |  First Published Jan 24, 2024, 12:05 PM IST

దేశంలో  బాలికల విద్యను ప్రోత్సహించేందుకు  ప్రభుత్వం  అనేక కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో భాగంగానే  ఐదు రకాల స్కాలర్ షిప్ లను కూడ రూపొందించారు.



న్యూఢిల్లీ: ప్రతి ఏటా  జనవరి  24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.  బాలికలకు సమాన అవకాశాలు, గౌరవం, విద్య, వైద్యం, పోషకాహారం వంటి అంశాల్లో  ప్రాధాన్యత ఇచ్చే విషయాలపై  ఫోకస్ చేయనున్నారు. బాలికల కోసం దేశంలో ఐదు స్కాలర్ షిప్  పథకాలు అందుబాటులో ఉన్నాయి.

1.ఎఐసీటీఈ ప్రగతి స్కాలర్ షిప్ ఫర్ గర్ల్స్:

Latest Videos

బాలికలకు టెక్నికల్ విద్యలో సపోర్టు చేయడం, ప్రోత్సహించడం కోసం డిజైన్ చేశారు. ఈ స్కాలర్ షిప్ లు పొందాల్సిన బాలికలు ఉండాల్సిన అర్హతలను చూద్దాం.ఎఐసీటీఈ అనుమతి పొందిన  ఏదైనా  ఇనిస్టిట్యూట్  నుండి డిగ్రీ ఫస్టియర్ లో లేదా డిప్లామా ప్రొగ్రామ్ లో చేరాల్సి ఉంటుంది. ఒక కుటుంబానికి  ఒకరికే  అనుమతి ఇస్తారు.అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఈ పథకం వర్తింపజేయాలంటే  ఆ కుటుంబ ఆదాయం  ఏటా  రూ. 8 లక్షలుగా ఉండాలి. ఈ పథకం కింద  ఏటా రూ. ట్యూషన్ ఫీజు కింద రూ. 30 వేలు చెల్లిస్తారు. లేదా  ప్రతి నెల రూ. 2 వేలు ప్రతి నెల 10 మాసాలు  చెల్లించనున్నారు.ఫీజు రీఎంబర్స్ మెంట్ ను ఆఫ్షన్ కూడ ఉంది.

2. బేగం హజ్రత్ మహల్  నేషనల్ స్కాలర్ షిప్

గతంలో  మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్ షిప్ పథకమే ప్రస్తుతం బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్ షిప్ గా మారింది.  మైనారిటీ వర్గానికి చెందిన  మెరిట్ బాలికలకు స్కాలర్ షిప్  ను అందించనున్నారు.
 స్కూల్, కాలేజీ, సిలబస్ పుస్తకాలు, స్టేషనరీ, ఎక్విప్ మెంట్, బోర్డింగ్, లాడ్జింగ్ వంటి  చార్జీలను ఈ స్కాలర్ షిప్ నుండి పొంద వచ్చు.
 ఆరు నోటిఫైడ్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బాలికలు  50 శాతం పైగా మార్కులను  పరీక్షల్లో పొందాలి.
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు  ప్రతి నెల రూ. 5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.  పదకొండు, పన్నెండు తరగతులు విద్యార్థులకు ప్రతి నెల రూ. 6 వేలను చెల్లించనున్నారు.

3. పోస్టు గ్రాడ్యుయేట్  ఇందిరా గాంధీ స్కాలర్ షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్

నాన్ ప్రొఫెషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ చదువుకునే  బాలికలకు ఆర్ధిక సహాయం  అందించడమే ఈ పథకం ఉద్దేశ్యం. గుర్తింపు పొందిన యూనివర్శిటీ, పోస్టు గ్రాడ్యుయేట్స్ కాలేజీల్లో   చదువుకొనే బాలికా విద్యార్థులు  ఈ పథకం కింద  ఆర్ధిక సహాయం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి నెల రూ. 2 వేలను రెండేళ్ల పాటు అందించనున్నారు.

4. సీబీఎస్ఈ మెరిట్ స్కాలర్ షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్

బాలికా విద్యను ప్రోత్సహించే ఉద్దేశ్యమే  ఈ స్కాలర్ షిప్ ముఖ్య ఉద్దేశ్యం.  సీబీఎస్ఈ లో 10,11, 12 తరగతుల్లో   60 శాతానికి పైగా మార్కులు పొందిన  మెరిట్ బాలికలకు  ట్యూషన్ ఫీజును  ప్రతి నెల  రూ. 1500 చెల్లించనున్నారు. మరో వైపు  ప్రతి నెల  500 చొప్పున  రెండేళ్ల పాటు అందించనున్నారు.

5. మహిళా సైంటిస్ట్ స్కీమ్-బీ (డబ్ల్యుఓఎస్-బీ)


డీఎస్‌టీ మహిళా సైంటిస్ట్ స్కీమ్  బీ కింద  మహిళలకు స్కాలర్ షిప్ ను అందించనున్నారు.  27 నుండి  57 ఏళ్ల మధ్య మహిళలకు  ఈ పథకం కింద స్కాలర్ షిప్ లు అందించనున్నారు.పీహెచ్‌డీ లేదా సమానమైన చదువుకొనే వారికి ప్రతి నెల  రూ. 55 వేలు చెల్లించనున్నారు. ఎంఫిల్, ఎంటెక్  వారికి నెలకు రూ. 40 వేలు చెల్లించనున్నారు.


 

click me!