గుడ్‌న్యూస్: మార్కెట్లోకి జూలైలోనే కరోనా మందు 'డెస్రెం'

By narsimha lodeFirst Published Jul 6, 2020, 8:36 PM IST
Highlights

కరోనాను నిరోధించేందుకు గాను దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ సంస్థ తయారు చేస్తున్న రెమిడెసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్ ఈ నెలలోనే విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మైలాన్ సంస్థ సోమవారం నాడు ప్రకటించింది.

న్యూఢిల్లీ: కరోనాను నిరోధించేందుకు గాను దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ సంస్థ తయారు చేస్తున్న రెమిడెసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్ ఈ నెలలోనే విడుదల చేయనుంది. ఈ విషయాన్ని మైలాన్ సంస్థ సోమవారం నాడు ప్రకటించింది.

ఇండియాలో 'డెస్రెం' పేరుతో  ఈ డ్రగ్ ను విడుదల చేస్తామని మైలాన్ సంస్థ ప్రకటించింది. గిలియడ్ సైన్సెస్ కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమెడిసివిర్ జనరిక్‌ వెర్షన్‌ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయల చొప్పున విక్రయించనుంది. ఈ మేరకు గిలియడ్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. 

also read:నిమ్స్‌లో మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్: ఈ నెల 7 నుండి ప్రారంభం

‘డెస్రెం’  పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సిప్లా, హెటిరో సంస్థలు కూడ రెమిడెసివిర్ జనరిక్  వెర్షన్ ను కూడ ప్రకటించిన విషయం తెలిసిందే. 

సిప్రెమిని పేరుతో సిప్లా కంపెనీ రూ. 5 వేలలోపు ధరకే ఈ మందును అందించనుంది. హెటిరో డ్రగ్ కోవిఫోర్ డ్రగ్ ను రూ. 5400లకు నిర్ణయించింది. కరోనా రోగులపై వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ సంస్థ మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించనుంది.

ఈ నెల 7వ తేదీ నుండి హైద్రాబాద్ నిమ్స్ లో  కోవాక్సిన్  ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. దేశంలోని 12 ప్రాంతాల్లో  క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఆగష్టు 15వ తేదీ నాటికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఐసీఎంఆర్ ఆశాభావంతో ఉంది.

click me!