రెమిడెసివిర్ డ్రగ్: ఇండియాలో తయారీకి మైలాన్ ల్యాబ్ కు అనుమతి

By narsimha lodeFirst Published Jul 3, 2020, 11:22 AM IST
Highlights

 కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్ 'రెమిడెసివిర్' తయారీతో పాటు మార్కెట్ చేసేందుకు ఇండియాకు చెందిన మైలాన్ ల్యాబ్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్ 'రెమిడెసివిర్' తయారీతో పాటు మార్కెట్ చేసేందుకు ఇండియాకు చెందిన మైలాన్ ల్యాబ్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

అమెరికాకు చెందిన ప్రముఖ పార్మాసూటికల్స్ కంపెనీ గిలీడ్ సైన్సెస్ సంస్థ రెమిడెసివిర్ డ్రగ్ ను తయారు చేస్తోంది. కరోనా రోగులపై ఈ డ్రగ్ అత్యంత ప్రభావంతంగా పనిచేస్తోందని ఇప్పటికే నిర్వహించిన పరిశోధనలు తేల్చాయి. వచ్చే మూడు మాసాల పాటు రెమిడెసివిర్ డ్రగ్ ను అమెరికా మాత్రమే బుక్ చేసుకొంది.

ఈ మూడు మాసాల పాటు ఇతర దేశాలకు సింగిల్ డోస్ కూడ దక్కని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో రెమిడెసివిర్ డ్రగ్ ను ఇండియాలో తయారీకి మైలాన్ ల్యాబ్స్ సంస్థకు డీసీజీఐ గురువారం నాడు అనుమతి పొందింది.

also read:కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు: మనుషులపై ప్రయోగాలు సక్సెస్

కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రోగులపై ఈ డ్రగ్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ డ్రగ్ ను వినియోగించాల్సి ఉంటుంది. ఈ డ్రగ్ ను ఇండియాలో తయారీతో పాటు మార్కెట్ చేసేందుకు మైలాన్ సంస్థ అనుమతి పొందింది. హైద్రాబాద్ కు చెందిన హెటిరో సంస్థ కోవిఫోర్ పేరుతో కరోనా రోగులకు ఇంజక్షన్ ను తయారు చేసింది.సిప్లా కంపెనీ కూడ మరో డ్రగ్ ను విడుదల చేసింది. 


గిలిడ్ సైన్సెస్‌ యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ మార్కెటింగ్‌కు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది.  దీంతో  రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి పంపిణీ చేయడానికి  మైలాన్‌తో పాటు సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో, బీఆర్‌డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.

click me!