కేరళలోని వయనాడ్ ప్రాంతంలో భారీ కొండచరియల వల్ల మృతుల సంఖ్య 264కి చేరుకుంది. భారీ వర్షాలు సహాయక చర్యలను కష్టతరంగా మారుస్తున్నాయి. వయనాడ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగే అవకాశం ఉందని హెచ్చరిక ఉంది.
కేరళ చరిత్రలోనే అతిపెద్ద కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 264కి చేరింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయి.
అయితే, సైన్యం బెయిలీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం వంతెన నిర్మాణం చివరి దశలో ఉంది. గురువారం మధ్యాహ్నం లోపు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సైన్యం భావిస్తోంది. మరోవైపు వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరిక ఉంది. అన్ని కష్టాలను అధిగమించి, ఇంకా 240 మంది ఆచూకీని కనిపెట్టాల్సి ఉంది. భూమిలో బురద మట్టిలో సమాధి అయిన వారి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.