వేల యేళ్ల పురాతన, సంప్రదాయ ఆట జల్లికట్టు.. దీని ప్రత్యేకతలివే..

By SumaBala BukkaFirst Published Jan 12, 2024, 8:48 AM IST
Highlights

అవనియాపురం జల్లికట్టు కోసం ప్రతి సంవత్సరం 1000 టోకెన్లు ఇస్తున్నారు. కానీ అన్ని ఎద్దులు పాల్గొనలేకపోతున్నాయట. ఎద్దుల పోటీకి ఒక్కరోజు సరిపోదని.. తమకు రెండు రోజులు కావాలంటున్నారు పోటీదారులు.

తమిళనాడు : సంక్రాంతి వచ్చిందంటే చాలు తమిళనాడులోని ప్రతీ ఊరు జల్లికట్టుకు సిద్ధం అయిపోతుంది. సంవత్సరమంతా పోటీల కోసం తయారు చేసిన ఎద్దులతో బుల్ బ్రీడర్లు రెడీగా ఉంటారు. ఒకేసారి తమ ఎద్దును వివిధ ప్రాంతాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేలా చేస్తారు. 

జల్లికట్టు అనే పదం రెండు పదాల కలయిక. ఆ పదాలు ‘కల్లి’ (నాణేలు), ‘కట్టు’ (టై), ఇది ఎద్దు కొమ్ములకు కట్టిన నాణేల కట్టను సూచిస్తుంది. జల్లికట్టు అనేది తమిళనాడులో 2,000 సంవత్సరాల కిందటినుంచి వస్తున్న పోటీ. ఎద్దును మచ్చిక చేసుకునే క్రీడ, ఇందులో పోటీదారులు బహుమతి కోసం ఎద్దును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అందులో వారు విఫలమైతే, ఎద్దు యజమాని బహుమతిని గెలుచుకుంటాడు. ఇది సంక్రాంతి పండుగ సమయంలో జనవరి రెండవ వారంలో జరుపుకుంటారు.

Latest Videos

జల్లికట్టు పోటీలకు ఎద్దులను ఎలా తయారు చేస్తారో తెలుసా?

జల్లికట్టు కోసం కాంగయం, పులికులం, ఉంబలచేరి, బర్గూర్, మలై మాడు లాంటి దేశీయ పశువుల జాతులను ఉపయోగిస్తారు. జల్లికట్టు ప్రస్తావన మొదటగా మొహెంజొదారోలో దొరికిన ఒక ముద్రలో ఉన్నాయి. ఇది 2,500 బిసి, 1,800 బిసి మధ్య కాలానికి చెందిన క్రీడగా చెబుతారు. అప్పట్లో దీనిని ఎరు తాజువల్ అని పిలిచేవారు, అంటే "ఎద్దును ఆలింగనం చేసుకోవడం" అని అర్థం.

ఇక ఇప్పుడు తమిళనాడులో అవనియాపురం జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక్కడే జల్లికట్టు ప్రారంభమవుతుంది. ఎద్దు పోటీ కోసం విడుదల చేస్తారు. ఇందులో పాల్గొనేవారంతా బుల్ టామర్స్, బుల్ బ్రీడర్స్. దీనిమీద అక్కడివారు మాట్లాడుతూ.. ‘అవనియాపురం జల్లికట్టు మంచిదే. ప్రతి సంవత్సరం 1000 టోకెన్లు ఇస్తున్నారు. కానీ అన్ని ఎద్దులు పాల్గొనలేకపోతున్నాయంటున్నారు. ఎద్దుల పోటీకి ఒక్కరోజు సరిపోదని.. తమకు రెండు రోజులు కావాలంటున్నారు.

ఈ పోటీల్లో ఒకేసారి వరుసలో 10 ఎద్దులు వస్తాయి. ఇక్కడున్నవారిలో ఒకతను ఒకసారి బంగారు నాణెం గెలిచానని చెప్పాడు. ఈ సారి కూడా అవనియాపురం జల్లికట్టు మొదటిది. ఇక్కడ పోటీలో పాల్గొనేందుకు 800లకు పైగా ఎద్దులు రానున్నాయి. కానీ సమయాభావం కారణంగా 300 నుంచి 350 ఎద్దులు మాత్రమే పాల్గొంటాయని అక్కడున్నవారు అంటున్నారు. 

click me!