Islam Nusantara: ఐఎస్ఐఎస్ తీవ్రవాద భావజాలానికి ఇండియోనేషియా కౌంటర్ ఇదే

By Asianet News  |  First Published Jul 7, 2023, 2:45 PM IST

ఇస్లాం మతంలో తీవ్ర వాద భావజాలాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఇండోనేషియా ప్రత్యామ్నాయంగా ఇస్లాం నుసంతారాను అభివృద్ధి చేసింది. ఈ ప్రత్యామ్నాయ భావజాలం గురించి మన్సూరుద్దీన్ ఫరీదీ ఓ కథనం రాశారు.
 


న్యూఢిల్లీ: 90వ దశకం మధ్యలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ లేదా ఐఎస్ఐఎస్ దాని హింసాత్మక ఇస్లామిక్ భావజాలం ద్వారా మొత్తం ముస్లిం ప్రపంచాన్ని ముప్పులోకి తోసింది. పలు ముస్లిం దేశాల నుంచి యువతను ఈ హింసాత్మక భావజాలం నుంచి రక్షించాల్సిన బాధ్యత ఈ దేశాల మీద పడింది. ఈ కర్తవ్యాన్ని ఇండోనేషియా సమర్థవంతగా చేపట్టింది. ఇండోనేషియాలో పెద్ద ముస్లిం సంస్థ నహద‌లతుల్ ఉలామా టెర్రరిస్టు గ్రూపు వల నుంచి ఆ దేశ యువతను కాపాడుకోవాలని సంకల్పించింది.

52 మిలియన్ల నుంచి 95 మిలియన్ల సభ్యులున్న ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం సంస్థ నహద్‌లతుల్ ఉలామా దేశంలోని ముస్లిం సంప్రదాయాలను మరింత స్పష్టం చేయాలని నిర్ణయించుకుంది. ఇతర మతస్తులను ఆదరిస్తూ బహుళత్వ సమాజంగా ఈ దేశం శాంతియుతంగా ఉన్నది. ఈ దేశం ఖలీఫా భావనను విశ్వసించదు. కాబట్టి, తీవ్రవాద భావజాలాన్ని తిప్పికొట్టడానికి ఎన్‌యూ ఇస్లాం నుసంతారా పేరిట తమ మత విశ్వాసాలను మాడరేట్ చేసింది. 2015 ఆగస్టులో ఎన్‌యూ తన 33వ జాతీయ సదస్సు థీమ్ ఇదే.

Latest Videos

ఇతర ముస్లిం దేశాల్లాగే ఇండోనేషియా కూడా ఐఎస్ఐఎస్ తమ దేశంలో అడుగు పెట్టవచ్చని భయపడింది. ఇతర దేశాల్లోని ఇస్లామిక్ స్కాలర్లు ఏమీ చేయలేకపోయారు. కానీ, ఎన్‌యూ మాత్రం కౌంటర్‌గా ప్రత్యామ్నాయ భావజాలాన్ని అభివృద్ధి చేసింది.

ఎన్‌యూ క్యాంపెయిన్‌కు ఆ దేశ ప్రభుత్వ మద్దతు సంపూర్ణంగా ఉన్నది. ఆ దేశ జాతీయ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ సహా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో కూడా ఎన్‌యూను సమర్థించారు. దేశ బహుళత్వ సమాజాన్ని కాపాడాలనే తమ 1945 ఇండోనేషియా రాజ్యాంగాన్ని, బహుళత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది.

జిహాద్ అనేది ప్రాచీన ఇస్లాం యొక్క తీవ్రవాద బోధనలకు సంబంధించినదని, వాటిని ఎన్‌యూ ప్రత్యామ్నాయ భావజాలం స్పష్టంగా తిరస్కరించింది. తీవ్రవాదం, ఉగ్రవాదంతో బాధపడే దేశాలకు ఇస్లాం నుసంతారా భావజాలం సరైన విరుగుడు అని ఆ దేశ స్కాలర్లూ అంగీకరించారు. అందుకే గత కొన్ని దశాబ్దాలుగా ఈ భావజాలాన్ని వారు ఎత్తిపడుతున్నారు. దీని ప్రధాన లక్ష్యం ఇస్లాంను  స్థానిక పోకడలకు, ఆచారాలకు అన్వయించుకోవడం. మరో విధంగా చెప్పాలంటే అరబ్ వాసనలను ఈ మతం నుంచి తొలగించడం.

ఇస్లాం అరబ్ నుంచే ఇండోనేషియాకు వచ్చింది. కానీ, పశ్చిమాసియా ముస్లింలకు, ఇండోనేషియా ముస్లింలకు సామాజికంగా వ్యత్యాసం ఉన్నది. వారు అరాబా వంటి సాంస్కృతి కట్టుబట్లను పట్టించుకోరు. ఇండోనేషియా ఇస్లాం అభివృద్ధి చెందడానికి మాడరేట్ వైఖరి కలిగిన సూఫీ ముస్లింలు అక్కడికి వెళ్లడమే ప్రధాన కారణం.

ఇస్లాం నుసంతారాను ఇస్లాంలోని ఒక రూపంగా భావించవచ్చు. ఆ రూపం ముస్లింలలో స్థానికమైన గుర్తింపును బలోపేతం చేస్తుంది. కాబట్టి, వారు ఇతర మతాలు, ఇతర విశ్వాసాలు కలిగి ఉన్నవారి పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. ఇది మన భారత్‌లోని గంగా జమునీ నాగరికతను పోలే ఉంటుంది.

స్థానిక సంప్రదాయాల చట్రం నుంచి ఇస్లాంను చూడటానికి ఇండోనేషియా ఇస్లాం ముఖ్యమైన ఆలోచనా విధానం. మన దేశంలోనూ భక్తి ఉద్యమం నుంచి కొంత సారాన్ని ఇస్లాం సూఫీలు గ్రహించినట్టుగా అక్కడా జరిగింది.

కాబట్టి, ఇస్లాం చుట్టూ ఆవరించిన అనవసరపు భయాలను ఇస్లాం నుసంతారా తొలగిస్తుందని ఇండోనేషియా నిపుణులు చెబుతారు.

ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ అట్లాస్ బీబీసీతో మాట్లాడుతూ.. ఆధునిక ఇస్లాం.. వాహాబీ, సలాఫీ ఇస్లాం వలే స్థానిక ఆచార వ్యవహరాలను తిరస్కరించదు. ఇక్కడికి వచ్చిన ముస్లిం సూఫీల మాధ్యమ వైఖరే ఇండోనేషియా ఇస్లాం మాడరేట్‌గా అభివృద్ధి చెందడానికి కారణం అని ఆయన వివరించారు.

Also Read: భారత్‌లో ఐదు రోజులు పర్యటించనున్న ఎండబ్ల్యూఎల్ చీఫ్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీం అల్ ఇసా

భిన్న విశ్వాసాలు కలిగిన సమాజం పటిష్టంగా ఉండటానికి సామరస్యంగా, శాంతియుతంగా సహజీవనం చేయడానికి ఈ మాడల్ కీలకమైనదని భావిస్తున్నారు. అందుకోసమే భారత్ సహా అనేక దేశాలు ఇండోనేషియా ఇస్లాం పద్ధతుల వైపు చూస్తున్నాయి.

దీనికి సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గౌతమ్ చౌదరి ఇలా రాశారు. ఇండియా బహుళ విశ్వాసాలు కలిగిన సమాజమని, ఇక్కడ ఇండోనేషియా ఇస్లాం నుసంతారాను పాటించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. కానీ, ఆ ఇండోనేషియా వర్షన్‌ను భారత వర్షన్‌కు మార్పు చేసుకోవచ్చని, ఎందుకంటే తీవ్రవాద ముప్పు ఈ రెండు దేశాలకూ ఒకేలా ఉన్నదని వివరించారు.

ఇక్కడ ఉదయ్‌పూర్ ఊచకోత వలెనే ఇండోనేషియాలోనూ 90ల్లో ముస్లిం, క్రిస్టియన్ల మధ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. వీటిని మతాంతర సంస్థలు ఏర్పాటు చేయడం, నిర్మాణాత్మక చర్చలు చేపట్టి ఇండోనేషియా వీటిని పరిష్కరించుకుందని వివరించారు.

 

---మన్సూరుద్దీన్ ఫరీదీ

click me!