బాయ్‌ఫ్రెండ్‌తో బయటకెళ్లిన బాలికపై గ్యాంగ్ రేప్

By telugu team  |  First Published Oct 9, 2021, 2:09 PM IST

సాయంత్రం పూట బాయ్‌ఫ్రెండ్‌తో బయట నడుచుకుంటూ కాలక్షేపం చేసిన ఓ బాలికపై దుండగులు పంజా విసిరారు. వారిరువురిపైనా దాడి చేశారు. అనంతరం, బాలికను సమీపంలోని పంటపొలాల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 


నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతులేకుండా పోతున్నది. women ఇంటి గడప దాటాలంటే భయపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా, నాగ్‌పూర్‌లో ఓ gang rape ఘటన చోటుచేసుకుంది. boy friendతో బయటకెళ్లిన బాలికపై దాడి చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన కలకలం రేపుతున్నది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాధవ్ నగరి ఏరియాలో గ్యాంగ్ రేప్ చోటుచేసుకుంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ girl బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయట వాకింగ్ వెళ్లింది. వీధిలోనే ఓ చోట నిలుచుని వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో నలుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. వారిరువురిపైనా దాడి చేశారు. గాయాలపాలైన ఆ 17 ఏళ్ల బాలికను సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.

Latest Videos

undefined

ఈ ఘటనపై కేసు పెట్టిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఇతరుల కోసం గాలిస్తున్నారు. 

ఇటీవలే మహారాష్ట్రలోని డొంబివిలి సాకినాకలో జరిగిన సామూహిక లైంగికదాడి ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. సాకినాకలో ఓ మైనర్ బాలికకు చెందిన అసభ్యకర వీడియోను సాకుగా చూపి బెదిరించి 33 మంది సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కనీసం రెండు డజన్ల మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

click me!