ఓ ప్రొడక్షన్ హౌజ్ తనకు మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింగ్ ఇచ్చి తనపై పోర్న్ వీడియో షూట్ చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసు.. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన ఈ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత.. ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది ఆరోపణలు చేశారు. తమతో బలవంతంగా పోర్న్ వీడియోలు చిత్రీకరించారంటూ వారు ఆరోపించారు. కాగా.. తాజాగా.. ఇలాంటి కామెంట్స్ మాజీ మిస్ ఇండియా యూనివర్స్ పరీ పాసవాన్ సంచలన కామెంట్స్ చేశారు.
ఓ ప్రొడక్షన్ హౌజ్ తనకు మత్తు పదార్థాలు కలిపిన కూల్ డ్రింగ్ ఇచ్చి తనపై పోర్న్ వీడియో షూట్ చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ముంబై వచ్చిన కొత్తలో ఓ ప్రొడక్షన్ హౌజ్‌కు వెళ్లాను. అక్కడ వాళ్లు నాకు కూల్‌డ్రింగ్ ఇచ్చారు. అయితే అందులో మత్తు కలిపి నేను స్పృహా కొల్పోయేలా చేసి ఆ తర్వాత నాపై అడల్ట్ కంటెంట్ వీడియో తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను’ అని వెల్లడించింది. అయితే ఆమె ఆ ప్రొడక్షన్ హౌజ్ పేరు మాత్రం ఆమె బయట పెట్టలేదు.
కాగా గతంలో పరీ పాసవాన్ తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆమె భర్త నీరజ్ పాసవాన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే ఈ కేసులో భర్త నీరజ్ తరపు బంధువులు పరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీ పాసవాన్ ముంబయికి చెందిన ఓ ప్రొడక్షన్ హౌస్ లో పోర్న్ ఫిలింలో నటించిందని.. అమాయకులను బుట్టలో వేసుకోవడమే తన పని అని ఆరోపించారు. అంతేకాకుండా ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉందని.. ఇంతకుముందే ఇద్దరితో పెళ్లి కూడా అయిందని నీరజ్ సోదరుడు చందన్ పేర్కొన్నారు. కాగా పారి పాసవాన్ 2019లో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ కంటెస్టెంట్ పాల్గొని టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆమెకు నీరజ్‌తో పరిచయం, ఆ తర్వాత పెళ్లి జరిగింది.