శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఎవరు తయారు చేశారో తెలుసా??

By SumaBala Bukka  |  First Published Dec 20, 2023, 10:54 AM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ నమూనాను ఎవరు తయారు చేశారు? ఎవరు ఆమోదించారు? ఎప్పటినుంచి అందుబాటు ఉంది? ఏఏ మార్పులు జరిగాయి? 


అయోధ్య : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతినుంచే అయోధ్య రామమందిరం వివాదం మొదలయ్యింది. దశాబ్దాల తరువాత ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రారంభ పవిత్రోత్సవం 22 జనవరి 2024న జరుగుతుంది. నిర్మాణం సమయంలో అయోధ్యకు వెళ్లినవారికి కరసేవకపురంలోని ఒక భవనంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆలయ నమూనా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రారంభం కాబోతున్న  శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనా ఎలా తయారు చేయబడిందో చూద్దాం. 

1989లో ఆమోదం

Latest Videos

వీహెచ్‌పీ ప్రావిన్షియల్ మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ మాట్లాడుతూ - 1989 ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో సాధువులు ఈ రామ మందిర నమూనాను ఆమోదించారు. ఆ తరువాత ఈ నమూనా ప్రతి హిందువు ఇంట్లోనూ పూజలందుకుంది. ఈ నమూనా ప్రకారమే రామ మందిర నిర్మాణానికి పునాది పడింది. అయితే, 2020లో శంకుస్థాపన తర్వాత, ఆలయ నమూనాను మూడు అంతస్తులుగా మార్చారు. ఇంతకు ముందు ఇది రెండంతస్తులుగా ఉండేది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మొదటి అంతస్తు, రెండవ అంతస్తు ఉన్నాయి. దీని పొడవు, వెడల్పు కూడా పెరిగింది. 

రామ్ మందిర్ : ఎల్ కే అద్వానీ, ఎంఎం జోషిలకు ఆహ్వానం.. స్వయంగా అందించిన వీహెచ్‌పి..

అంతకుముందు ఇది 128 అడుగుల పొడవు, 155 అడుగుల వెడల్పుతో ఉండేది. ఇప్పుడు పొడవు 350 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు అయింది. అయితే మోడల్ భాగాలు అలాగే ఉన్నాయి. ఇలా - సింహం, నాట్య మండపం, పవిత్ర గర్భగుడి. అందులో కీర్తన మండపం, సత్సంగ మండపం కూడా నిర్మించబడ్డాయి. ఇప్పుడు ఈ మోడల్ విస్తృతంగా ప్రచారం అయ్యింది. 

నమూనాను తయారుచేసిందెవరు?

మొదట సివి సోంపురా తర్వాత విజయ్ దూది రామమందిర నమూనాను రూపొందించారు. దీని గురించి శరద్ శర్మ మాట్లాడుతూ- గుజరాత నివాసి సి.వి.సోంపురా ఈ ఆలయ అసలు నమూనాను రూపొందించారు. సి.వి.సోంపురా పూర్వీకులు సోమనాథ్ ఆలయాన్ని నిర్మించారు. సి.వి.సోంపురా ఈ మోడల్ ను చెక్కతో తయారు చేశారు. ఈ మోడల్ ను వర్క్‌షాప్‌లో ఉంచారు. జైపూర్ నివాసి విజయ్ దూదికి తాజ్ మహల్, ఇతర కళాఖండాలను తయారు చేసినట్లే ఎవరైనా రామ మందిర నమూనాను ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది? దీంతో ఆయన 2000 సంవత్సరంలో ఆలయ నమూనాను తయారు చేయడం ప్రారంభించాడు. ఆలయాన్ని ఎలా నిర్మించాలో చక్కగా పొందుపరిచాడు. ఆయన రూపొందించిన నమూనాలో ప్రతి స్తంభంలోనూ దేవతామూర్తుల చిత్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ మోడల్ తయారీలో థర్మాకోల్, మార్బుల్ డస్ట్ ఉపయోగించారు.

2002 నుంచి కరసేవకపురంలో

మోడల్ లోపలి భాగం 51000 చిన్న బల్బులను ఉపయోగించి చెక్కబడింది. విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి గిరిరాజ్‌ కిషోర్‌ జైపూర్‌ వెళ్లినప్పుడు, ఆ నమూనాను చూసి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చారు. ఈ ఆలయ నమూనా 2001లో ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ఉంచారు. ఆ సమయంలో రామ మందిర నమూనాను చూసేందుకు సందర్శకులు విపరీతంగా వచ్చారు. కుంభమేళా ముగిసిన తర్వాత 2002లో కరసేవకపురంలోని ఓ భవనానికి ఈ నమూనాను తీసుకొచ్చారు. అప్పటి నుండి ఈ ఆలయ నమూనా ఇక్కడే ఉంది. ఆలయాన్ని నిర్మిస్తున్న అదే నమూనా ఆధారంగా శ్రీరాముని ఆలయాన్ని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. 

శ్రీ రామ జన్మభూమి ఆలయ నమూనాను బాబా హజారీ దాస్ నిర్వహిస్తున్నారు. భక్తులకు శ్రీరామ మందిర నమూనా దర్శనం అయ్యేలా చూస్తున్నారు. బాబా హజారీ దాస్ 1990లో అయోధ్యకు వచ్చారు. తర్వాత ఇక్కడే ఉండిపోయాడు. షాజహాన్‌పూర్ నివాసి బాబా హజారీ దాస్ బాబ్రీ కూల్చివేత నుండి ఆలయ నిర్మాణం వరకు ప్రతిదీ చూశాడు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గాయపడ్డారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత కొన్నేళ్లుగా భక్తులకు శ్రీరామ మందిరం నమూనా దర్శనం కల్పిస్తున్నారు.

click me!