Daggubati Purandeshwari Biography: మాటల్ని సూటిగా, పొదుపుగా వాడుతూ, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండే నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరీ. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఆమెకు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఓ సారి దగ్గుబాటి పురందేశ్వరీ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, తదితర విశేషాలు మీకోసం ..
Daggubati Purandeshwari Biography:
దగ్గుబాటి పురందేశ్వరీ బాల్యం, విద్యాభ్యాసం,
పురందేశ్వరి స్వర్గీయ నందమూరి తారకరామారావు, బసవతారకంల కుమార్తె. ఆమె 1959 ఏప్రిల్ 22న చెన్నైలో జన్మించారు. ఆమె చదువుతో పాటు చిత్రలేఖనం, నాట్యం పై ఆసక్తి ఉండేది. దీంతో ఆమె చదువుతో పాటు కూచిపూడి భరతనాట్యం (8 సంవత్సరాలు) భరతనాట్యం (5 సంవత్సరాలు) పాటు నేర్పించారు.స్కూల్ చదువు అయిపోయాక సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఉమెన్ కాలేజీలో చేరి బిఏ లిటరేచర్ పూర్తి చేశారు. ఆ తర్వాత గేమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరి గేమాలజీ పూర్తి చేశారు. ఈ కోర్సు పూర్తి చేశాక హైదరాబాదులో ఉన్న హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జేమ్స్ అండ్ జ్యువలరీ లో చేరారు. ఆ తర్వాత పలు జ్యూవెలరీ సంబంధించిన కొన్ని షో రూమ్లలో కూడా చెరి వాటి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు.
వివాహం:
అప్పటికే ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన దగ్గుపాటి చెంచురామయ్య గారు ఎన్టీఆర్ గారు ఇద్దరికీ కొంచెం పరిచయం ఉండేది. వారి అబ్బాయి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎంబిబిఎస్ పూర్తి చేయడంతో తన కూతురు పురందేశ్వరుని వెంకటేశ్వరరావుకి ఇచ్చే వివాహం చేయాలనుకున్నారు. ఇలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు- పురందరేశ్వరి ల వివాహం 1979 మే 9న జరిగింది. ఎన్టీఆర్ 1982లో టిడిపి పార్టీ పెట్టడం.. ఆ తరువాత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో (1983)ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున ప్రకాశం జిల్లాలో ఉన్న పరుచూరి నియోజకవర్గంలో 1984లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. పురందరేశ్వరి గారు గృహిణిగా ఉండేది. వీరికి ఒక పాప( నివేదిత) ఒక బాబు (హితేష్ చెంచు రాము). వారి ఆలనా పాలన ఆమెనే చూసుకునేవారు.
కుటుంబ నేపథ్యం
అయితే.. 1985లో పురందేశ్వరీ తల్లి బసవతారకమ్మ కన్నుమూయడం . ఆ తరువాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడంతో నందమూరి కుటుంబంలో ముసలం పుట్టింది. ఒకవైపు చంద్రబాబు ఎన్టీఆర్ కి కుడి భుజంగా.. వెంకటేశ్వరరావు ఎడమ భుజంలా ఉండేవారు. కానీ ఇద్దరికీ లక్ష్మీపార్వతి రాక ఆమె తీరుతెను నచ్చలేదు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తీరు రోజు రోజుకి మారుతుండడం. లక్ష్మీపార్వతి అధికారం కోసం ప్రయత్నించడం. ఎన్టీఆర్ కూడా లక్ష్మి పార్వతికే వత్తాసు పలకడంతో చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని ఒక్కతాటిపైకి తెచ్చాడు. దీనికి వెంకటేశ్వరరావు - పురందేశ్వరి లు కూడా మద్దతుగా నిలిచారు. ఆ ప్రభావమే.. 1995 నాటి వైస్రాయ్ ఘటన ఎన్టీఆర్ ని గద్దించాక చంద్రబాబు సీఎం పదవిని అధిరోహించారు.
కానీ, వెంకటేశ్వరరావు ని, నందమూరి కుటుంబాన్ని పక్కకి నెట్టేశాడు.దాంతో అప్పటినుంచి చంద్రబాబును వ్యతిరేకించి పురందేశ్వరీ- వెంకటేశ్వర్లు టిడిపి నుండి బయటికి వచ్చేసారు. ఇతర నాయకులు , కార్యకర్తలు సలహాలతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. 1999 ఎన్నికల్లో దగ్గుపాటి రామానాయుడు టిడిపి తరఫున బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తుండగా ఆయనకు దీటుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు దింపాలని వైయస్సార్ భావించాడు. అలాగే.. వెంకటేశ్వర్లుకు బాపట్ల పార్లమెంట్ టికెట్ ఇప్పించారు. ఈ ఎన్నికల్లో వెంకటేశ్వరరావు విజయం సాధించింది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
పురందేశ్వరీ రాజకీయ ప్రవేశం
దగ్గుపాటి వెంకటేశ్వర్లు జాతీయ రాజకీయాల్లో బిజీ కావడంతో పురందేశ్వరుని రాజకీయాల్లోకి దించాలని ప్రయత్నించారు. ఈ విషయాన్నే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పగా.. ఎన్టీఆర్ కుమార్తె పైగా మంచిగా చదువుకున్న ఆమె కావడంతో కాంగ్రెస్ నాయకులు అందరూ సమ్మతించారు. కానీ, ఈ విషయం పురందేశ్వరీకి తెలియదు. పేపర్లలో చూసి మొదట ఆశ్చర్యపోయారు. వెంకటేశ్వరరావుని అడ్డగా ఆయన ఆమెకు నచ్చజెప్పారు. ఆలా 1999లో విజయవాడలోని ఓ బహిరంగ సభలో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్లోకి చేరారు పురందేశ్వరి .
అయితే 1999లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు.. రామానాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు. దీంతో పురందేశ్వరి రాజకీయాల్లో కొంత పట్టు సాధించారు. ప్రజల్లో ఆమె మమేకమయ్యారు. ఆమె ఫాలోయింగ్ చూసి.. వైయస్ రాజశేఖర్ రెడ్డి మిగతా కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యపోయారు. దాంతో 2004 లోక్ సభ ఎన్నికల్లో వెంకటేశ్వర్ ని కాకుండా బాపట్ల లోక్సభ నియోజకవర్గంలో రామానాయుడుకి దీటుగా పురందేశ్వరీని రంగంలో దించారు. కాంగ్రెస్ ప్రయోగం ఫలించింది. ఆమెకు ఎన్టీఆర్ కూతురు అన్న సానుభూతి కూడా దొరుకడంతో ఆ ఎన్నికల్లో రామానాయుడుపై మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది ఎన్టీఆర్ బిడ్డ మజాకా అని నిరూపించింది.
బాపట్ల నియోజకవర్గం కోసం ఎంపీ ఫండ్ నుంచి నిధులు వచ్చేలా చేశారు. ఆమెకు 2004, 2005 బెస్ట్ పార్లమెంటేరియన్ గా అవార్డు కూడా వచ్చింది. ఆమె పని తీరు మెచ్చిన సోనియా గాంధీ.. మన్మోహన్ క్యాబినెట్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఆ తర్వాత 2006 జనవరి 29న హ్యూమన్ రిసోర్చ్ డెవలప్మెంట్ మంత్రిగా నియమించారు. మళ్ళీ 2009 సాధారణ ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు విశాఖపట్నం లోకసభ నియోజకవర్గ నుండి టికెట్ ఇప్పించారు. అయితే 2009లో ఒకపక్క టిడిపి మరోపక్క ప్రజారాజ్యం పార్టీలు గట్టి పోటీని ఇచ్చాయి టిడిపి తరఫున డాక్టర్ ఎంబీబీఎస్ మూర్తి ప్రజారాజ్యం తరపున పళ్ళ శ్రీనివాసరావు నిల్చున్నారు అయినా ఆ ఎన్నికల్లో వైయస్సార్ మేనియా పురందేశ్వరి వ్యక్తిత్వంతో గెలుపొందారు పురందేశ్వరి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మరోమారు ఆమె కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా సహాయమంత్రిగా నియమితులయ్యారు. ఈ పదవిలో అక్టోబర్ 2012 వరకు కొనసాగారు. ఆ తర్వాత 2012 నవంబర్ 1 నుంచి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖా సహాయమంత్రిగా నియమితులయ్యారు.
కాంగ్రెస్ ని వీడి బీజేపీలోకి
తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన తీరు పురందేశ్వరికి నచ్చలేదు. దీంతో విభజన తరువాతఆమె తన మినిస్టర్ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసేసారు. ఆ తర్వాత 2014లో బిజెపిలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో బిజెపి టిడిపి టిడిపి పొత్తు పెట్టుకున్నాయి. దీంతో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ టికెట్ హరిబాబు ఇచ్చింది. ఇలా బిజెపి పార్టీలో చేరిన ఆమె ప్రచారానికి పరిమితమయ్యారు. అయితే ఆమెకు బిజెపి.. జాతీయ మహిళా మోర్చా ప్రబరి పదవినిచ్చారు. 2019 ఎన్నికల్లో ఆమెకు విశాఖపట్నం లోక్సభ టికెట్ ఇచ్చారు. కానీ, బీజేపీ మీద కోపంతోను జగన్ మీద ప్రేమతో ఉన్న ఏపీ ప్రజలు ఆమె ఓడించారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె భర్త వెంకటేశ్వరరావు మాత్రం రాజకీయాల మీద విరక్తితో రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఏదేమైనా పురందరేశ్వరి ఏపీ రాజకీయాల్లో తన సత్తా చాటుతున్నారు.
దగ్గుబాటి పురందేశ్వరీ బయోడేటా
పూర్తి పేరు: దగ్గుబాటి పురందేశ్వరీ
పుట్టిన తేదీ: 22 Apr 1959 (వయస్సు 65)
పుట్టిన ప్రాంతం: చెన్నై, తమిళనాడు
పార్టీ పేరు : Bharatiya Janta Party
విద్య: బిఏ లిటరేచర్,
వృత్తి: రాజకీయ నాయకురాలు
తండ్రి పేరు: ఎన్.టీ. రామారావు
తల్లి పేరు : ఎన్. బసవ రామ తారకం
జీవిత భాగస్వామి పేరు: దగ్గుపాటి వెంకటేశ్వర రావు
జీవిత భాగస్వామి వృత్తి: రాజకీయ నాయకుడు
మతం:హిందూ