డీకే అరుణ: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, 

By Rajesh Karampoori  |  First Published Mar 14, 2024, 5:55 AM IST

D K Aruna Biography: మహిళలు రాజకీయాల్లోకి రావడం చాలా కష్టం. అలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చినా.. ఎక్కువమంది తండ్రి చాటు బిడ్డగానో.. భర్త చాటు భార్య గానో చలామణి అవుతుంటారు. కానీ, తెలంగాణ రాజకీయాల్లో కింది స్థాయి నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె గద్వాల జేజమ్మ  డీకే అరుణ.  మామూలు మహిళగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె కాకలు తీరిన  నేతలను సైతం మట్టి కరిపించారు. ఆమె ఒంటె చేత్తో పాలమూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు డీకే అరుణ. ఆమె రాజకీయ ప్రస్థానం మీకోసం.. 


DK Aruna Biography: ధర్మవరపు కొట్టం అరుణ అలియాస్ డీకే అరుణ. ఆమె అసలు పేరు అరుంధతి. ఆమె రాజకీయాలను చూస్తూనే పెరిగారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అటు ఆమె మామ సత్యారెడ్డి, భర్త భరతసింహారెడ్డి, బావ సమరసింహారెడ్డి ముగ్గురు గద్వాల్ ఎమ్మెల్యేలుగా పనిచేసినవారే. భార్య  అడుగుజాడల్లోనే దిగారున కూడా గద్వాల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తండ్రి నర్సిరెడ్డి మరణం తర్వాత సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు.  ఇలా ఆమె  ఎటు చూసినా పొలిటికల్ వాతావరణమే..

బాల్యం

Latest Videos

డీ కే అరుణ..  1960, మే 4 న  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ..  మక్తల్ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో స్వాతంత్ర దినోత్సవ నాడు నారాయణపేటలో నక్సలైట్ల కాల్పులకు గురై బలయ్యారు.చిట్టెం నర్సిరెడ్డి మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తన సోదరుడు రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అలాగే.. భర్త భరత సింహారెడ్డి , మామ డీకే సత్యారెడ్డి లు కూడా పేరుందిన రాజకీయ నేతలే. గతంలో వారు గద్వాల్ నుంచే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 

విద్యాభ్యాసం

డీకే అరుణ సెవెంత్ క్లాస్ వరకు సొంత గ్రామంలో చదువుకుంది. ఆ తర్వాత హైదరాబాదులో మాడపాటి హనుమంతరావు పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఇక ఇంటర్ రెడ్డి కాలేజీలో చదువుకుంది. ఆమె చిన్నప్పుడు చురుకైన అమ్మాయి. ఎన్ సీసీ వంటి సేవ కార్యక్రమాల్లో ఆమె చురకుగా పాల్గొనేది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం భరత సింహారెడ్డి తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి స్రవంతి, శృతి, హిఘ్న ముగ్గురు కుమార్తెలు. కాక ఈ ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. ఆమెకు నలుగురు సోదరీమణులు ఉన్నత చదువులు చదివినప్పటికీ అరుణ మాత్రం రాజకీయాల్లోకి వచ్చింది. 

రాజకీయ జీవితం

>> ఆమె మొదటిసారి కొల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని పంతల్ మండలంలో జడ్పిటిసిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అరుణ టిడిపిలో చేరారు. ఈ క్రమంలో డీకే అరుణ 1996లో మొదటిసారి మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో ఓడిపోయింది.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం 1999లో గద్వాల శాసనసభ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టిడిపి అభ్యర్థి గట్టు భీముడు చేతిలో పరాభవం చెందింది. 

>> ఓటమి గెలుపుకు నాంది అని భావించిన డీకే అరుణ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ, టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేసింది. ఈ తరుణంలో గతంలో ఓడిన టిడిపి అభ్యర్థి గట్టు భీములను ఓడించి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టింది.  కాగా 2004లో డీకే అరుణకు జిల్లాలోని అత్యధిక మెజార్టీ లభించడం విశేషం.  సమాజ్వాది పార్టీ తరఫున గెలిచినా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలుగా కొనసాగింది. దీనితో ఆమె ఫిబ్రవరి 2007లో సమాజవాది పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది. 
 
>> ఈ నేపథ్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసింది. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో సఫలిక్రుతురాలైంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నిక అవ్వడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటు పొందిన తొలి మహిళ నేతగా పేరు సంపాదించింది

>> తెలంగాణ ఉద్యమ సమయంలో అరుణ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి కొట్టింది దీంతో గద్వాల గడ్డ అరుణ అడ్డగా మారింది ఇలా మూడుసార్లు గెలిచిన అరుణ నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో అరుణ సఫలమయ్యారు 

>> గద్వాలలో జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ సర్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డీకే అరుణ 2016లో తన పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో దిగి వచ్చిన టిఆర్ఎస్ జోగులాంబ జిల్లాగా నామకరణం చేశారు . కాగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయించిన ఘనత తనకే దొరుకుతుందని అరుణ అంటుంటారు. అధికార పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు 

>> ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కారు జోరు సాగిన నేపథ్యంలో అరుణ ఘోర పరాభవం చెప్పారు.  అయితే అరుణమాత్రం ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై పదునైన విమర్శలు చేశారు అయితే అదే ఎన్నికల్లో అరుణ తనకి కూతురు సిద్ధారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ అరుణనే  పోటీ చేశారు.  ఈ ఎన్నికల్లో ఆమె అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 28 వేల మెజార్టీతో గెలుపొందారు . 

>> ఇక అరుణ  2019లో ఎంపీ టికెట్ ఆశించిన కాంగ్రెస్లో దక్కి అవకాశాలు లేకపోవడంతో కాషాయం కండువా కప్పుకుని లోక్సభ రిలోకి దిగారు డీకే అరుణ బిజెపిలో చేరిన తర్వాత డీకే అరుణకు ఆ పార్టీ కూడా జాతీయ ఉపాధ్యక్షురాలు పదవితో పెద్దపీట వేసింది తెలంగాణలో బలోపేతం చేయడం కోసం ఏ కాంగ్రెస్ పార్టీలో తాను రాజకీయ ఓనమాలు నేర్చు కున్నారో అదే కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తుంది. 

>> 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఆమెకు లోక్ సభ టికెట్ను ఇచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెడుతుందో లేదో వేచి చూడాలి. 

డీ కే అరుణ బయోడేటా

పూర్తి పేరు: డీ కే అరుణ
పుట్టిన తేదీ: 04 May 1960 (వ‌య‌స్సు  64)
పుట్టిన ప్రాంతం: నారాయ‌ణపేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్
పార్టీ పేరు: BJP  
విద్య: 12th Pass
వృత్తి: వ్య‌వ‌సాయం, రాజ‌కీయాలు
తండ్రి పేరు: చిట్టెం న‌ర్సిరెడ్డి
తల్లి పేరు    : 
జీవిత భాగస్వామి:     డీ.కే. భ‌ర‌త సింహా రెడ్డి
సంతానం    : 3 కుమార్తెలు
శాశ్వత చిరునామా: 2-2-20, రాజ‌వీధి, గ‌ద్వాల్, తెలంగాణ‌.
 

click me!