పంట వ్యర్థాలను కాల్చకుండా ఇలా చేసారో... ఎన్ని లాభాలో..! : యోగి సర్కార్ చేయమంటోంది అదే

By Arun Kumar PFirst Published Oct 3, 2024, 12:30 PM IST
Highlights

పంట వ్యర్థాల దహనంపై వల్ల  వాయు కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో అందరికీ తెెలుసు. డిల్లీ వంటి నగరాలు ఈ వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ క్రమంలో పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించడం కోసం యోగి సర్కార్ సరికొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళుతోంది... 

లక్నో : పంట వ్యర్థాల దహనంపై యోగి ప్రభుత్వం విధించిన కఠిన నియమాల వల్ల ఫలితం కనిపిస్తోంది. పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే నష్టాలను గురించి రైతులకు వివరించడం... అలాకాకుండా కంపోస్ట్ ఎరువులు తయారుచేసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి వివరించడం ద్వారా మార్పు తీసుకువచ్చారు. ఇక సీడ్ డ్రిల్ ద్వారా నేరుగా గోధుమ విత్తనాలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి రైతులకు అవగాహన కల్పించడంలో యోగి ప్రభుత్వం విజయం సాధించింది.

ఈ విధానాల కారణంగా గత ఏడు సంవత్సరాలుగా పంట వ్యర్థాల దహన సంఘటనలు దాదాపు 46% తగ్గాయి. 2017లో 8784 పంట వ్యర్థాల దహన సంఘటనలు నమోదు కాగా, 2023లో ఈ సంఖ్య 3996కి తగ్గింది. ఇది యోగి ప్రభుత్వం సాధించిన అద్భుత విజయమేనని చెప్పాలి. 

Latest Videos

ఇక ఈ సీజన్‌లో కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే పొలాల్లోనే పంట వ్యర్థాలను కంపోస్ట్ చేసుకోవడానికి 7.5 బయో డీకంపోజర్‌లను యోగి ప్రభుత్వం అందిస్తోంది. ఒక ఎకరం పొలంలోని పంట వ్యర్థాలను కంపోస్ట్ చేయడానికి ఒక బాటిల్ డీకంపోజర్ సరిపోతుంది. పంట వ్యర్థాలను కాలిస్తే ఏకంగా రూ.15,000 జరిమానా విధించబడుతుందని రైతులు గమనించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 

పంట వ్యర్థాల దహనం యొక్క దుష్ప్రభావాలు

పంట కోత తర్వాత దాన్యాన్ని సేకరించి మార్కెట్ కు తరలిస్తుంటారు రైతులు. మిగిలిన పంట వ్యర్థాలను తొలగించి మరో పంట వేసుకోడానికి సిద్దమవుతారు. ఈ క్రమంలో పంట వ్యర్థాలను పొలంలొనే కాలుస్తుంటారు. ఇలా చేయడంవల్ల పర్యావరణ కాలుష్యాన్ని సృష్టించడమే కాదు భూమి సారాన్ని తగ్గిస్తున్నామని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పంట వ్యర్థాలను కాల్చడమంటే మన చేతులతోనే మన భూమిని నాశనం చేసుకోవడమట. పంట వ్యర్థాల దహనం ద్వారా భూమిలోని నత్రజని, భాస్వరం, పొటాషియం (NPK) వంటి పోషకాలు నాశనం అవుతాయి. అలాగే కోట్లాదిగా భూమి సారానికి కారణమయ్యే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు కూడా దహనం అవుతాయట. అందువల్లే పంట వ్యర్థాలను కాల్చడం మంచిది కాదంటున్నారు నిపుణులు. 

అంతేకాదు పంట వ్యర్థాల్లోనూ భూమికి సారం అందించే పోషకాలు వుంటాయట. కాబట్టి కాల్చే బదులు, వాటిని పొలంలోనే కంపోస్ట్ చేస్తే నేలను సారవంతంగా మారుస్తాయి.   దీనివల్ల తదుపరి పంటకు దాదాపు 25% ఎరువులు ఆదా అవుతాయి, దీనివల్ల సాగు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. భూమిలోని సేంద్రియ పదార్థాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు సంరక్షించబడటం, పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ తగ్గింపు అదనపు ప్రయోజనాలు.

గోరఖ్‌పూర్ ఎన్విరాన్‌మెంటల్ యాక్షన్ గ్రూప్ అధ్యయనం ప్రకారం ఎకరా పొలంలో పంట వ్యర్థాల దహనం వల్ల 400 కిలోల ఉపయోగకరమైన కార్బన్,  10-40 కోట్ల బ్యాక్టీరియా మరియు 1-2 లక్షల శిలీంధ్రాలు పోషకాలతో పాటు నాశనమవుతాయట..

ఇతర ప్రయోజనాలు

పంట అవశేషాలతో కప్పబడిన నేల తేమగా ఉండటం వల్ల సూక్ష్మజీవుల చురుకుదనం పెరుగుతుంది, ఇది తదుపరి పంటకు సూక్ష్మపోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా  అవశేషాలతో కప్పబడిన నేల తేమను నిలుపుకుంటుంది, దీనివల్ల నేల నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల నీటిపారుదల అవసరం తగ్గుతుంది, దాని ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా విలువైన నీరు కూడా ఆదా అవుతుంది.

పంట వ్యర్దాలను కాల్చే బదులు వాటిని పొలంలొనే లోతుగా దున్ని నీటిపారుదల చేయండి. త్వరగా కుళ్ళిపోవడానికి నీటిపారుదలకు ముందు ఎకరాకు 5 కిలోల యూరియా చొప్పున చల్లవచ్చు. దీని వల్ల పంట వ్యర్థాలు త్వరగా భూమిలో కలిసిపోయి పోషకాలుగా మారతాయి. అ

click me!