నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ , డిస్నీ హాట్‌స్టార్‌లకు ఇక దబిడి దిబిడే.. ఓటీటీల నియంత్రణకు కొత్త చట్టం , నిబంధనలివే

By Siva Kodati  |  First Published Nov 11, 2023, 5:25 PM IST

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించేందుకు , వాటి ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.


నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించేందుకు , వాటి ఫ్రేమ్‌వర్క్‌ను ఏకీకృతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ స్ట్రీమింగ్ దిగ్గజాలను నియంత్రించడానికి కంటెంట్ మూల్యాంకన కమిటీలను నియమించుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.  ఈ మేరకు సమాచార , ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ముసాయిదా చట్టాన్ని ప్రకటించారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' , 'ఈజ్ ఆఫ్ లివింగ్' కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రణాళికలను కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. బ్రాడ్‌కాస్టింగ్ సెక్టార్‌లో రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునీకరించేందుకు డ్రాఫ్ట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లు రూపొందించబడిందని ఠాకూర్ పేర్కొన్నారు.  

'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్','ఈజ్ ఆఫ్ లివింగ్' కోసం ప్రధానమంత్రి చేపట్టిన ప్రణాళికలను ముందుకు తీసుకువెళుతూ, ముసాయిదా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (నియంత్రణ) బిల్లును ప్రవేశపెట్టడం మాకు గర్వకారణం. ఈ కీలకమైన చట్టం మా ప్రసార రంగ నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునీకరించి, పాత చట్టాలను భర్తీ చేస్తుంది. ఏకీకృత, భవిష్యత్తు-కేంద్రీకృత విధానంతో నియమాలు , మార్గదర్శకాలు వుంటాయని " అని ఠాకూర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 

Latest Videos

 

Advancing the Honorable Prime Minister's vision for 'Ease of Doing Business' and 'Ease of Living,' we're proud to introduce the draft Broadcasting Services (Regulation) Bill.

This pivotal legislation modernizes our broadcasting sector's regulatory framework, replacing outdated…

— Anurag Thakur (@ianuragthakur)

 

ప్రతిపాదిత చట్టం ప్రసార రంగానికి సంబంధించిన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునీకరించడం, వాడుకలో లేని చట్టాలు, నియమాలు , మార్గదర్శకాలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఠాకూర్ హైలైట్ చేశారు. ప్రస్తుతమున్న ఇంటర్-డిపార్ట్‌మెంటల్ కమిటీని 'బ్రాడ్‌కాస్ట్ అడ్వైజరీ కౌన్సిల్'గా మార్చడంతో పాటుగా 'కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీల' ఏర్పాటు కొత్త చట్టంలోని కీలక అంశం.  కొత్తగా ఏర్పాటు చేసిన ప్రసార సలహా మండలి.. ప్రకటనల కోడ్, ప్రోగ్రామ్ కోడ్‌ ఉల్లంఘనలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. పీటీ నివేదికల ప్రకారం.. సెక్టోరల్ నిపుణుడి నేతృత్వంలోని కౌన్సిల్ విశిష్ట వ్యక్తులు, బ్యూరో‌క్రాట్‌లను కలిగి వుంటుంది. 

రాయిటర్స్ కథనం ప్రకారం.. కొత్త చట్టం ముసాయిదా పత్రంలో ‘‘ప్రతి బ్రాడ్‌కాస్టర్ లేదా ప్రసార నెట్‌వర్క్ ఆపరేటర్ తప్పనిసరిగా వివిధ సామాజిక సమూహాలకు చెందిన సభ్యులతో కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ (సీఈసీ)ని ఏర్పాటు చేయాలి. నిబంధనలు, కథనాలను ఉల్లంఘించినందుకు స్వీయ నియంత్రణ సంస్థల సభ్యులపై ద్రవ్య, ద్రవ్యేతర జరిమానాలను విధించడానికి కొత్త చట్టం అధికారం కల్పిస్తుంది. అలాగే ఈ బిల్లులో పెనాల్టీల శ్రేణిని వివరించారు. హెచ్చరికలు, ఆపరేటర్లు, ప్రసారకర్తలకు ద్రవ్య జరిమానాలు విధిస్తారు. నేరాన్ని బట్టి జైలు శిక్ష విధించాలా లేక జరిమానాతో సరిపెట్టాలా అన్నది నిబంధనల్లో పొందుపరిచారు. 

click me!