11 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ కజిన్స్ గ్యాంగ్ రేప్.. అత్తింట్లో అత్యాచారం...

By SumaBala Bukka  |  First Published Jun 17, 2023, 9:47 AM IST

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలికపై ఆమె మేనత్త ఇంట్లో బంధువులైన ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


రాజస్థాన్‌ : ఓ మైనర్ పై సామూహిక అత్యాచారం జరిగిన దారుణ ఘటన రాజస్థాన్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత 11యేళ్ల బాధిత బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 11 ఏళ్ల బాలికపై ఆమె ఇద్దరు బంధువులు, ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారం చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరింది. ఉదయపూర్‌లోని అంబమత ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం, అమ్మాయి తన మేనత్త ఇంటికి వచ్చింద. అక్కడ 13, 15 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బంధువులు ఆమెపై అత్యాచారం చేశారు. కొద్దిసేపటికే, బాలిక అంతర్గత గాయాల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో, ఆమె బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Latest Videos

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సుఖేష్ చంద్రశేఖర్ రూ.10 కోట్ల విరాళం.. చట్టబద్ధంగా సంపాదించానని, స్వీకరించాలని లేఖ

వైద్యులు ఆమె పరీక్షించి.. వెంటనే ఆపరేషన్ చేశారు. మైనర్ బాలిక తనకు జరిగిన దారుణాన్ని వైద్యులకు వివరించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని తన బంధువులిద్దరూ బెదిరించారని ఆమె కుటుంబసభ్యులకు, వైద్యులకు చెప్పింది.

ఈ విషయమై అంబమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ విచారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యల కోసం జువైనల్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, విచారణకు నాయకత్వం వహించిన డీఎస్పీ చేతనా భాటి ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. బాధితురాలు కోలుకున్న తర్వాత, ఆమె వాంగ్మూలం రికార్డు చేసి కోర్టులో సమర్పిస్తామని.. చట్టపరమైన ప్రక్రియను త్వరితగతిన చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. 

click me!