సవతులతో కలిసి జీవించాలని భార్యను బలవంతం చేసే హక్కును భర్తకు ఇవ్వలేదని తెలిపింది.ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆశగా మిగలకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని గుజరాత్ హైకోర్టు గుర్తుచేసింది. దాంపత్య హక్కులు కేవలం భర్తకు మాత్రమే సొంతమైనవి కాదని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ నీరల్ మెహతాల బెంచ్ అభిప్రాయపడింది. ఈ విషయంలో తీర్పు ఇచ్చే ముందు భార్య అభిప్రాయాన్ని కుటుంబ కోర్టు తెలుసుకోవాలని సూచించింది.
అహ్మదాబాద్ : ఒక మహిళను husbandతో కలిసి నివసించాలని, కాపురం చేయాలని కోర్టులు బలవంతం చేయలేవని Gujarat High Court అభిప్రాయపడింది. ఈ మేరకు కుటుంబ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అంతేకాకుండా Muslim law బహుభార్యత్వం అనుమతిస్తుంది. కానీ ప్రోత్సహించలేదని, అందువల్ల ఒక వ్యక్తి తొలి భార్య అతనితో కలిసి ఉండేందుకు నిరాకరించవచ్చని కూడా వ్యాఖ్యానించింది. సవతులతో కలిసి జీవించాలని భార్యను బలవంతం చేసే హక్కును భర్తకు ఇవ్వలేదని తెలిపింది.
ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆశగా మిగలకూడదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని గుజరాత్ హైకోర్టు గుర్తుచేసింది. దాంపత్య హక్కులు కేవలం భర్తకు మాత్రమే సొంతమైనవి కాదని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ నీరల్ మెహతాల బెంచ్ అభిప్రాయపడింది. ఈ విషయంలో తీర్పు ఇచ్చే ముందు భార్య అభిప్రాయాన్ని కుటుంబ కోర్టు తెలుసుకోవాలని సూచించింది.
2010లో పిటిషనర్ మహిళకు ఒక వ్యక్తితో వివాహం అయింది. 2015లో వీరికి ఒక కుమారుడు కలిగాడు. నర్సుగా ఆమెను ఆస్ట్రేలియాకు పంపాలన్న భర్త కుటుంబ నిర్ణయంతో వ్యతిరేకించి 2017లో ఆమె అత్తింటి నుంచి బయటకు వచ్చింది. దీనిపై భర్త కుటుంబం కోర్టును ఆశ్రయించగా కోర్టు కాపురానికి వెళ్లాలని ఆమెను ఆదేశించింది. దీనిపై ఆ మహిళా హైకోర్టుకు వెళ్ళింది. విచారణ జరిపిన కోర్టు బలవంతంగా కాపురం చేయించడం జరగదని తేల్చి చెప్పింది.
ఆయన మరో 8వేల సంవత్సరాలు ఇజ్రాయెల్ విడిచి వెళ్లవద్దు.. విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని ఓ కోర్టు తీర్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సగటు మనిషి వందేళ్లు బతకడం నేడు గొప్ప. అలాంటిది ఆ కోర్టు ఓ వ్యక్తిపై 8 వేలకుపైగా సంవత్సరాల నిషేధాజ్ఞలు విధించింది. ఔను.. ఓ ఆస్ట్రేలియా వ్యక్తిపై ఈ నిషేధం విధించింది. Divorce Case విచారిస్తూ సదరు వ్యక్తి ఇజ్రాయెల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం డిసెంబర్ 31, 9999 వరకు వర్తిస్తాయని ప్రకటించింది. దీంతో నిందితుడ నివ్వెరపోయాడు.
నోవామ్ హపర్ట్ ఆస్ట్రేలియా దేశస్తుడు. ఆయన ఇజ్రాయెల్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి సంతానం కూడా కలిగింది. కానీ, ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలతో ఆమె ఆస్ట్రేలియా వదిలి స్వదేశం ఇజ్రాయెల్ వెళ్లిపోయింది. నోవామ్ కూడా తన పిల్లలకు దగ్గరగా జీవించాలనే కాంక్షతో 2012లో ఇజ్రాయెల్ వెళ్లాడు. ఇజ్రాయెల్‌లోనే ఆయనపై భార్య 2013లో విడాకుల కేసు పెట్టింది. ఈ కేసు విచారిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఆ మహిళ ఇద్దరు పిల్లలు 18 ఏళ్లు నిండే వరకు రోజుకు 5000 ఇజ్రాయెల్ షెకెల్స్ ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ భవిష్యత్ రుణాన్ని పూర్తి చేసే వరకు దేశం విడిచి వెళ్లవద్దని తెలిపింది. అంటే, ఇప్పుడు నోవామ్ హపర్ట్ హాలీడేల కోసమైనా, పని కోసమైనా ఇజ్రాయెల్ దేశం విడిచే అవకాశమే లేదు. ఆ తీర్పు ప్రకారం, నోవామ్ హపర్ట్ 3.34 మిలియన్ డాలర్లకు మించి చెల్లిస్తే ఇజ్రాయెల్ దేశం వదిలి బయట అడుగు పెట్టవచ్చు. లేదా 9999 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇజ్రాయెల్ దేశం విడవరాదని ఆదేశించింది.