yedu chepala katha movie review: ‘ఏడు చేపల కథ’ రివ్యూ!

By AN TeluguFirst Published Nov 7, 2019, 3:43 PM IST
Highlights

మనవాళ్లు సహృదయంలో ఇతర భాషల సినిమాలు అయినా డబ్బింగ్ చేసినా, చెయ్యకపోయినా అర్దం చేసుకుని ఆదరించటంతో తెలుగులో డైరక్ట్ శృంగార సినిమాలు తక్కువే వచ్చాయి.

 

--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఆ మధ్య కాలంలో బూతు సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. ముఖ్యంగా ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు..వాటి మధ్యలో కలిపే బిట్లు కోసం ఎగబడేవారు. కొద్ది కాలానికి ఆ మాత్రం మనం తయారు చేసుకోలేమా అంటూ షకీలా వంటి స్టార్ అడల్ట్ హీరోయిన్స్ సీన్ లోకి వచ్చి రచ్చ రచ్చ చేసారు. అలాగే కన్నడంలో కాశీనాధ్ అనే దర్శక,హీరో ఉండేవాడు. అడల్ట్ కామిడీలు తీయటంలో ఆయనకు మంచి పేరు ఉండేవి.  

‘అనుభవం’, ‘వింత శోభనం’, ‘పొగరుబోతు పెళ్లాం’, ‘సుందరాంగుడు’, ‘భూలోకంలో రంభ ఊర్వశి మేనక’ వంటి సినిమాలు  తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడా బాగా ఆడాయి. ఒక టైమ్ లో స్టార్ హీరోల సినిమాలకు పోటీ ఇచ్చారు. అయితే తెలుగులో అంతలా సెమీ అడల్ట్ సినిమా ఇండస్ట్రీ అంతగా అభివృద్ది చెందలేదు. మనవాళ్లు సహృదయంలో ఇతర భాషల సినిమాలు అయినా డబ్బింగ్ చేసినా, చెయ్యకపోయినా అర్దం చేసుకుని ఆదరించటంతో తెలుగులో డైరక్ట్ శృంగార సినిమాలు తక్కువే వచ్చాయి.

అడపా,దడపా అడవిలో అందగత్తెలు వంటి సినిమాలు వచ్చినా క్వాలిటీ సరిపోక మనవాళ్లు ఆదరించలేదు. అయితే ఈ మధ్యకాలం ఆన్ లైన్ లోవ్ అంతులేని శృంగారం అవధులు లేకుండా ప్రవహిస్తూండటంతో థియోటర్ కు వచ్చి ఎవరు చూస్తారులే అని అంతా సైలెంట్ అయ్యిపోయారు. అబ్బే...పెద్ద తెరపై చూసే కథ వేరు ట్రై చేసిన ఈ ఏడు చేపలు కథ ఈ రోజు థియోటర్ లో రిలీజైంది. ఈ సినిమాలో కథ ఏమన్నా ఉందా..కేవలం శృంగార సన్నివేశాలతో సరిపెట్టారా...ఈ సినిమా మరిన్ని శృంగార సినిమాలకు నాంది అయ్యే అవకాసం ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి..?

‘నా ముందు ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్ .. టెంప్ట్ అయిపోతాను’.. తిరిగి వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్’.. అనేది టెంప్ట్ రవి (అభిషేక్ పచ్చిపాల) ఆవేదన. అతనికి తలసేమియా(ఎముక మూలుగలో హిమోగ్లోబిన్ ఉండే ఎర్రరక్తకణాల ఉత్పత్తి నిలిచిపోవడాన్ని తలసేమియా వ్యాధి అంటారు.) అనే జబ్బు ఉంటుంది.

దాంతో నెలకోసారి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. అందుకోసం డోనర్ ని వెతుకుతూ ఉంటారు రవి. అతనితో పాటు ఇదే జబ్బుతో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ.. బాధపడే మరో ముగ్గురు ఇద్దరు ఉంటారు. వీళ్లంతా ఒకే గదిలో ఉంటారు. అయితే వాళ్ళంతా సెల్ ఫోన్స్ దొంగతనాలు చేసి తమకు కావాల్సిన రక్తాన్ని కొనుక్కుంటూంటారు. అయితే రవి మాత్రం దొంగతనం ఇష్టపడడు. రవి ఈ సమస్యలో ఉండగానే అతన్ని చూసి టెమ్ట్ అయ్యి ఆడవాళ్లు అతనికి దగ్గరకు వస్తూంటారు.

వాళ్లెందుకు తనకు ఎట్రాక్ట్ అయ్యి వస్తున్నారో  అర్దం కాక తల కొట్టుకుంటూండు. మరో ప్రక్క ఓ అమ్మాయి (ఆయేషా సింగ్)తను ఎలా ప్రెగ్నింట్ ఎలా అయ్యానో తెలియక తికమక పడుతూంటుంది. ఇవి చాలదన్నట్లు ఆత్మలతో టచ్ లో ఉంటూ..వాటిని కావాల్సిన వారిలో ప్రవేశపెట్టి తన కోరికలు తీర్చుకోవాలనుకునే సుందర్. వీళ్లందరికీ ఒకరితో ఒకరికి తెలియని రిలేషన్  ఉంటుంది. ఆ చిక్కుముడి ఏమిటన్నది తెలియాలంటే  సినిమా చాలా ఓపిగ్గా చివరి దాకా చూడాలి.

ఎలా ఉందంటే..?

ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన అత్యంత తలా..తోక లేని సినిమా..అసలు కథగా ఏమనుకున్నారో..దాన్ని ఏమనుకుని తీసారో దర్శక,నిర్మాతలు వచ్చి చెప్తే కానీ అర్దం కానీ కంటెంట్. సెన్సార్ లో లేచిపోయాయో ఏమో కానీ ఒక సీన్ కు మరో సీన్ కు పొరపాటున కూడా సంభందం ఉండదు. తెర మీదకు క్యారక్టర్ వస్తూంటాయి..పోతూంటాయి. వాళ్లవెరో..వాళ్ల మోటివ్ ఏమిటో అర్దం కాదు..పరమ కంగాళీ సినిమా ఇది. సినిమాకు పనిచేసిన ఏ విభాగమూ సరిగ్గా చేయలేదు. అంతా ఏదో రాసారు..ఏదో తీస్తున్నారు అన్నట్లుగా చేసుకుంటూ పోయారు. కథ, కథనం ప్రక్కన పెడితే ఇలాంటి సినిమాల నుంచి ఆశించే మసాలా కూడా ఏమీ లేదు.  టెక్నికల్ గా కూడా మాట్లాడుకోవటానికి ఏమీ లేదు.
 
ఫైనల్ థాట్


ట్రైలర్ చూసి టెమ్ట్ అయితే ఆ తర్వాత రెండు గంటల నరకమే

Rating:1/5

click me!