'వివాహ భోజనంబు' రివ్యూ

By Surya Prakash  |  First Published Aug 27, 2021, 6:32 PM IST

కరోనా కారణంగా గతేడాది ప్రజలు ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితులకు ఫన్ జోడించి రాసుకున్న కథ ఇది. సత్య తొలిసారిగా హీరోగా చేసిన ఈ ప్రయత్నం ఓటీటి ద్వారా బయిటకు వచ్చింది. ఆ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అయ్యిందో చూద్దాం.


కరోనా,లాక్ డౌన్ కష్టాలని కామెడీగా డీల్ చేస్తూ ఆల్రెడీ కన్నడంలో ,హిందీలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మన టాలీవుడ్  వంతైంది. ఈ మధ్యకాలంలో తన కామెడీ టైమింగ్‌తో పేరు తెచ్చుకున్న సత్య ప్రధాన పాత్రలో పెట్టి చేసిన చిత్రం ‘వివాహ భోజనంబు’. తెలుగులో కొత్తగా లాంచ్ అయిన సోనీ లివ్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?నవ్వించినా... లాక్‌డౌన్‌ కష్టాలతో సాగే ఈ చిత్రం కథ ఏంటి?

కథ
ఎల్‌ఐసీ ఏజెంట్‌ పత్తి గింజల మహేష్ (సత్య) లో మిడిల్ క్లాస్ మనిషి.,పీనాసి మనస్తత్వం. పది పైసలు ఖర్చుపెట్టడానికి పది నిముషాలు లెక్కలు వేస్తూంటాడు. ఏదన్నా అంటే తాను పీనాసిని కాదని జాగ్రత్తపరుడుని అని గుర్తు చేస్తూంటాడు. ఆ సత్య హోటల్ బిజినెస్ లో బాగా సంపాదించన కుటుంబానికి చెందిన అనితతో (ఆర్జావీ)తో ప్రేమలో పడతాడు. ఆ విషయం తెలిసిన తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) షాక్ తిన్నా..తప్పక పెళ్లికి ఓకే అంటాడు.  సాధారణంగా,సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఇంట్లో జరుగుతుంది. కానీ తమ కుటుంబ ఆచారం ప్రకారం..మగపిల్లాడి ఇంట్లో చేయాలంటూ మహేష్ ఇంట్లో సకటుంబ సపరివార సమేతంగా దిగుతారు. వాళ్లందరినీ చూసి పీనాసి మహేష్ ఎంత ఖర్చు అవుతుందా అని వణికిపోతాడు. అయితే అతని దురదృష్టవశాత్తు మహేశ్‌ పెళ్లైన రోజు నుంచే కరోనా కారణంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన అనిత,ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహేశ్‌ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో పిసినారి అయిన మహేశ్‌ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? ఇంట్లో ఉన్న జనాలకి తిండి,తిప్పలు చూడటానికి పడిన తిప్పలు ఏంటి? ఈ కథలో అంబులెన్స్ డ్రైవర్ నెల్లూరు ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఏమిటి?  ఈ క్రమంలో ఏ మేరకు ఫన్ పండిండి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Latest Videos

undefined

 ఎనాలసిస్..

 ఒక పినాసి ఇంట్లో పది, పదిహేను మంది అనుకోని పరిస్దితుల్లో ఉండిపోతే, వారిని పొమ్మనలేక, ఉండమనలేక పోషించడానికి అతడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? అనేది ఎప్పుడూ ఫన్ ఎలిమెంటే..దానికి కరోనా లాక్ డౌన్ కలపటం అనేది క్రేజీ థాటే. కాదనలేం. కానీ ఇలాంటి థిన్ లైన్ స్టోరీలకు ట్రీట్మెంట్ అద్బుతంగా కుదరాలి. అదేమీ పట్టించుకున్నట్లు లేరు. తక్కువ బడ్జెట్ లో దాదాపు ఒకే ఇంట్లో కథ నడిచేలా సీన్స్ రెడీ చేసుకున్నారు. దాదాపు చుట్టేసినట్లుగా ప్రొడక్షన్ ఉంది. అదీ స్పష్టంగా తెలిసిపోతోంది. కామెడీ సినిమాలు కూడా కోట్లు గుమ్మరించి చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రయత్నం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. 

పైన చెప్పుకున్నట్లు కరోనా ,లాక్ డౌన్ చుట్టూ కామెడీ పాయింట్ అనగానే వినటానికి బాగానే అనిపిస్తుంది. కానీ తెరకెక్కేటప్పుడే చాలా గ్రౌండ్ వర్క్ చేయాలనిపిస్తుంది. దానికి తోడు లాక్ డౌన్ టైమ్ లో ఇలాంటి సంఘ‌ట‌న‌లూ విన్నాము..చాలా జ‌రిగాయి. కాబ‌ట్టి... క‌థ‌, క‌థ‌నం, సీన్స్ గొప్పగా,కొత్త‌వి అనిపించ‌వు. దానికి తోడు చాలా స్లో సో ఫేజ్ లో ఈ సినిమా మొద‌ల‌ెట్టారు. అయితే డైలాగు రైటింగ్ లో మంచి ఫన్ ఉండటంతో పెళ్లి త‌తంగం, స‌త్య పీనాసి బుద్ధులు, శ్రీ‌కాంత్ అయ్యంగార్ ఫ‌స్ట్రేష‌న్‌... వంటివాటితో ఫన్ బాగానే జనరేట్ అయ్యింది.అయితే హిలేరియస్ గా మాత్రం లేదు.పాయిట్ బాగా చిన్నదవటంతో సాగతీసారు. పోనీ సందీప్ కిషన్ వచ్చాక అయినా సినిమా పరుగెడుతుందేమో కానీ అదీ లేదు. అతను పాత్ర వచ్చాక మరీ డ్రాప్ అయ్యిపోయింది. అనుకున్న స్దాయిలో సందీప్ పాత్ర పేలలేదు. క్లైమాక్స్ సోసో గా ఉంది. అయితే ఇన్ని మైనస్ లు అనిపించినా సత్య మాత్రం తన పాత్రకు ప్రాణం పోసాడు. మాగ్జిమం సినిమాని మోసే ప్రయత్నం చేసాడు.
 
దర్శకత్వం,మిగతా విభాగాలు
దర్శకుడుగా తొలి చిత్రం చేసేవారికి ఇలాంటి సినిమాలు కత్తిమీద సామే. . చిన్న బడ్జెట్‌ , ఒకట్రెండు లొకేషన్స్ ల్లోనే సినిమా మొత్తం సాగుతూండటంతో బోర్ రాకుండా చేయాలి. సత్యలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ని కథకు ఎంచుకోవటంలో అతను మాగ్జిమం సక్సెస్ అయ్యాడు. అలాగే ప్రమోషన్స్ ని సందీప్ కిషన్ ని హైలెట్ చేయకుండా దాయటం మంచి ప్రయత్నం. లేకపోతే అది సందీప్ కిషన్ కథగా మారిపోయి చాలా దారుణంగా పరిస్దితి తయారయ్యేది. 

టెక్నికల్ గా సినిమా ఓకే. అన్వీ సంగీతం, మణికందన్‌ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. నిర్మాణ విలువలు మరీ పూర్ గా ఉన్నాయి.

ఫైనల్ థాట్
వివాహ భోజనం టైటిల్ మాత్రమే ఘనం
Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..
నటీనటులు: సత్య, సందీప్‌ కిషన్‌, ఆర్జవి, సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సుబ్బరాయశర్మ, టీఎన్‌ఆర్‌(దివంగత), హర్ష, శివన్నారాయణ, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు; 
సంగీతం: అన్వీ; 
సినిమాటోగ్రఫీ: ఎస్‌.మణికందన్‌; 
ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌; 
నిర్మాత: కె.ఎస్‌.శినిష్‌, సందీప్‌ కిషన్‌; 
రచన: భాను భోగవరపు; 

మాటలు: నందు ఆర్.
దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు; 
విడుదల: సోనీ లివ్‌

click me!